Breaking News

అత్యంత వృద్ధ 'డ్రైవర్‌ అమ్మ'..!

Published on Thu, 08/28/2025 - 10:59

పారిశ్రామిక దిగ్గజం అనంద్‌ మహీంద్రా ఎప్పటికప్పుడు స్ఫూర్తిని కలిగించే వీడియోలు, పోస్టులను నెట్టింట్‌ షేర్‌  చేస్తుంటారు. అలానే ఈసారి శక్తిమంతమైన వైరల్‌ వీడియోని నెట్టింట షేర్‌ చేశారు. ఉత్సాహం ఉరకలు వేసేలా కథన రంగంలోకి దిగడానికి.. ఆమెనే ప్రేరణ అంటూ నెట్టింట ఆమెకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. గతంలో ఆమెకు సంబంధించిన విషయాన్ని సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. తాజాగా ఆమె ప్రస్థానం మరింతకు ముందుకు సాగిన వైనాన్ని తెలుపుతూ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు జీవితాన్ని ఆస్వాదించడం పట్ల ఆమెకున్న ఆసక్తిని, తపనని ప్రశంసించారు. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..72 ఏళ్ల భారతీయ మహిళ మణి అమ్మ సాంప్రదాయ చీరలో దుబాయ్‌లో విలాసవంతమైన రోల్స్‌ రాయిస్‌ నడుపుతున్నట్టు కనిపిస్తోంది. ఈమె ఆత్మవిశ్వాసం, ప్రశాంతతకు నిలువెత్తు దర్శనం. "డ్రైవర్ అమ్మ"గా పిలిచే ఈ మణి అమ్మ సుమారు 11 రకాల వాహనాలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లను కలిగి ఉంది. కేరళలో డ్రైవింగ్‌ స్కూల్‌ని నడుపుతోంది. ఆమె కార్లు, ట్రక్కులు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్‌లతో సహా వివిధ వాహానాలను నడపటంలో ప్రావీణ్యం సంపాదించడమే కాదు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారామె. 

ఆమె స్టోరీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరిని ఆకర్షించింది, కదలించింది కూడా. అక్కడితో ఆమె ప్రస్థానం ఆగిపోలేదు. మహర్షి సినిమాలో మహేశ్‌ బాబు చెప్పినట్లు సక్సెస్‌ ఈజ్‌ జర్నీ దానికి పుల్‌స్టాప్‌లు ఉండవు అన్నట్లుగా ఈ మణి అమ్మ అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ను కూడా సంపాదించారు. ఆ లైసెన్స్‌తో ఆ దుబాయ్‌ నగర వీధుల్లో సగర్వంగా తిరుగుతూ..అత్యంత ప్రశాంత వదనంతో ఉన్న ఆమె ఆహార్యం నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. 

ఆనంద్‌ మహింద్రా సైతం ఈ రోజు ఆమె నాకు స్ఫూర్తి అంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్‌ చేశారు. జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడం ఎలా అనే విషయంలో ఆ మణి అమ్మ అందరికీ స్ఫూర్తి. అంతేగాదు బహుశా ఈ మణి అమ్మే..అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన అత్యంత వృద్ధమహిళ కావోచ్చు అంటూ నెటిజన్లు ఆమె పై ప్రసంశల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: నైజీరియా స్టూడెంట్స్‌ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!)

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)