అతడికి 72, ఆమెకు 27 : జోధ్‌పూర్‌లో ఏడడుగులు వేసిన విదేశీ జంట

Published on Sat, 09/20/2025 - 16:39

రాజస్థాన్‌  విలాసవంతమైన పెళ్ళిళ్లకు  పెట్టింది పేరు. తాజాగా  జోధ్‌పూర్‌లో జరిగిన  ఒక రాయల్‌ వెడ్డింగ్‌   ప్రత్యేకంగా నిలుస్తోంది. భారతదేశ  సంప్రదాయాలను గౌరవిస్తూ జోధ్‌పూర్‌ను ఎంచుకునీ మరి ఒక జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వీరు ఏఇండియన్ సెలబ్రటీలోఅనుకుంటే పొరబాటే. వీరు నాలుగేళ్లపాటు  సహజీవనం చేసిన ఒక  విదేశీ జంట. బారాత్‌నుంచి వధువు నుదిటిన తిలకం దిద్దడంవరకు ప్రతీ కార్యక్రమాన్ని అత్యంత సాంప్రదాయ బద్దంగా జరిపించుకోవడం విశేషం పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదవాల్సిందే. 

హిందూ ఆచారాలపై ప్రేమతో 72 ఏళ్ల వరుడు స్టానిస్లావ్, 27 ఏళ్ల వధువు అన్హెలినా భారతీయ ఆచారాలను స్వీకరించి, సప్తపధిని పాటించారు. వీరివురూ ఉక్రెయిన్‌కు చెందిన వారు.  జైపూర్, ఉదయపూర్, జోధ్‌పూర్ వేదికలను పరిశీలించి చివరికి జోథ్‌పుర్‌లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఈ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది. 


 

జోధ్‌పూర్ ఎందుకు?
రాజస్థాన్ చరిత్ర, జోధ్‌పూర్‌ నగర వైభవం, సాంస్కృతిక  వారసత్వం , ఐకానిక్ మెహ్రాన్‌గఢ్ కోట, వారసత్వ ప్రదేశాలు ,ఉత్సాహభరితమైన మార్కెట్లు తదిరరాజ నేపథ్యం వారిని ఆకర్షించింది. ఈ వివాహ సమన్వయ కర్తలు రోహిత్, దీపక్ మాట్లాడుతూ, వధువు అన్హెలినా భారతీయ ఆచారాలకు ఆకర్షితురాలైందని ప్రతి ఆచారాన్ని ప్రామాణికతతో గౌరవించాలని పట్టుబట్టారని వివరించారు.

సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన వధూవరులు
వధూవరులిద్దరూ  భారతీయ దుస్తులు ధరించి, వివాహ వేడుకల్లో పూర్తిగా మునిగిపోయారు, సాంప్రదాయ పాటలకు ఆనందంగా నృత్యం చేశారు. వరుడు రాజ షేర్వాణి,  రత్నాలు పొదిగిన  కాషాయ తలపాగాతో గుర్రంపై రావడంతో వివాహ వేడుకలు ప్రారంభమైనాయి. జోధ్‌పూర్‌లోని సుందరమైన ఖాస్ బాగ్‌లో సాంప్రదాయ టికా వేడుక అతన్ని స్వాగతించింది. ఆపై దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల నడుమ, జంటను పవిత్ర హోమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి స్టానిస్లావ్ అన్హెలినా మెడలో మంగళ సూత్ర ధారణ చేశాడు. ఆమె నుదిటిపై సింధూరం  దిద్ది వారి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు.


 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)