Breaking News

కొడుకుని మార్చబోయి.. ఆమెనే గేమింగ్‌ క్వీన్‌గా!

Published on Mon, 10/05/2026 - 11:53

కుమారుడి గేమింగ్‌ అలవాటుని మారుద్దామని అనుకుంది. దీనికి బానిసై మార్కులు కూడా తక్కువ వస్తున్నాయని భావించి ఆ అలవాటుని దూరం చేసేందుకు అతడితో తరుచుగా గొడవపడుతుండేది. అతడి చేతా ఆ అలవాటుని మానిపిద్దాం అనుకుని చేసిన ప్రయత్నం..చివరికి ఆమెనే అందులో క్వీన్‌గా చేసి, అదే ఆమె కెరీర్‌గా మారిపోయింది. నెట్టింట ఈ స్టోరీ వైరల్‌గా మారింది. 

ఆ అమ్మే చైనాకు చెందిన జోంగ్ జువాన్‌జువాన్. తన టీనేజ్‌ కుమారుడు కోసం ఇంటర్నెట్‌ కేఫ్‌లకు వెళ్లాల్సి వచ్చేది. అతడి గేమింగ్‌ అలవాటు వల్ల తానే బలవంతంగా ఇంటికి తీసుకురావల్సి వచ్చేది. ఆంటీ జువాన్‌గా పిలిచే ఈ బామ్మ తన కుమారుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌లో మంచి పేరుగాంచాడు. అతడు సెకండరీ స్కూల్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు బామ్మ జోంగ్‌వై ఖరి వేరుగా ఉండేది. అతడికి ఈ గేమ్‌ల పట్ల ఉన్న వ్యామోహం కారణంగా మార్కులు తక్కువుగా వచ్చేవి. 

అతడిని ఆచూకీ దొరకాలంటే ఇంటర్నెట్‌ కేఫ్‌లకు వెళ్లి వెతకాల్సి వచ్చేది. దీంతో అమ్మ కొడుకుల మధ్య తరుచుగా ఈ విషయమై విపరీతమైన గొడవలు జరుగుతుండేవి. అసలు ఎందుకలా తన కుమారుడు సువోడే ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి..ఎక్కువ గంటలు ఆ గేమింగ్‌లతోనే గడుపడానికి అసలు కారణం ఏంటని, అసలు అందులో అతడిని అంతగా ఆకర్షిస్తున్నది ఏంటి వంటివి తెలుసుకుందామని సాగిన ప్రయాణం..ఆ బామ్మను గేమింగ్‌ నేర్చుకోవాలనేందుకు దారితీసింది. 

సడెన్‌గా తన అమ్మ ఈ వీడియో గేమ్‌ల పట్ల ఇంత ఆసక్తి చూపిస్తుందేంటని..ఆశ్చర్యపోతూనే ఆమెకు అందులో శిక్షణ ఇచ్చాడు. మొదట్లో కంటి చూపు మందగించడంతో ఇబ్బంది పడింది. అలాగే ఆ ఆన్‌లైన్‌ టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో తడబడేది. ఆ తర్వాత సాధని చేసి..అందులో మంచి నైపుణ్యం సాధించి..ఏకంగా ఎనిమిదివేల గంటలకు పైగా గేమ్‌ప్లే కూడగట్టాడు. అలా 2022లో లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రారంభించింది. ఒక పెద్ద వయసు మహిళ గట్టి పోటీ ఇచ్చేలా ఆడుతుండటం చూసి ఆన్‌లైన్‌ వీక్షకులంతా విస్తుపోయేవారు. 

సెప్టెంబర్ 2024లో కౌంటర్-స్ట్రైక్: గ్లోబల్ ఆఫెన్సివ్ కోసం జరిగిన ఒక ఆన్‌లైన్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లోనే ఈ 60 ఏళ్ల జోంగ్‌ బామ్మకు పెద్ద బ్రేక్‌ వచ్చింది.  ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 17 ఏళ్ల రష్యన్ గేమింగ్ స్టార్ డాంక్‌నే మట్టికరింపించేలా విజయకేతనం ఎగరువేసింది. ఆమె వెనుక నుంచి వేరే వ్యక్తి ఎవరైనా ఆడుతున్నారా ఏంటి అని సందేహలు కూడా వ్యక్తం చేసేవారు ఆన్‌లైన్‌ వీక్షకులు. అయితే సుయోడే తన తల్లి ఆడుతున్నప్పుడే వివిధ కోణాల నుంచి రికార్డు చేసేలా కెమెరాలు ఫిక్స్‌ చేసేవాడు. 

ఈ వయసులో ఇదేంటని కొందరు విమర్శించినా..తాను వంటగదికే పరిమితం కావాలా అని జాంగ్‌ ఎదురుప్రశ్న వేసి, ఆ మాటలకు అడ్డుకట్ట వేసేది. అంతేగాదు ఆ బామ్మ గేమింగ్‌ అనేది మెదడును చురుకుగా ఉంచుతుంది, కంటి సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని వాదిస్తుండటం  విశేషం. 

విచిత్రం ఏంటంటే ఒకప్పుడూ గేమింగ్‌లో మునిగితేలుతున్న బాలుడిని తిట్టే ఆ 60 ఏళ్ల అమ్మనే..ఇంటర్నెట్‌ ఆఫ్‌ చేసేలా జ్రాగత్తలు తీసుకుంటాన్నాడు కుమారుడు సువోడే. దీంతో ఆమెకు ఇంటర్నెట్‌లో విఫరీతమైన ఫాలోవర్లు రావడమే కాదు..మచి ఫేమ్‌ కూడా వచ్చిందని అంటోంది. చాలామంది నెటిజన్లు జువాన్‌ఆంటీ మిమ్మల్ని సోషల్‌ వీడియోలో గేమ్స్‌ ఆడటం చూశాం అంటూ సంబరంగా చెబుతుండటం విశేషం. 

ఇదీ చదవండి: అక్కడ వరుడే అత్తారింటికి వెళ్తాడు..!

 

#

Tags : 1

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)