Breaking News

కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..

Published on Sun, 03/29/2026 - 15:43

శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ ఎంత కీలకమైనది అని చెప్పేందుకు ఈ కేసు ఓ ఉదాహరణ. తీవ్రమైన  అవయవ రక్తప్రసరణ అనేది అచ్చం గుండెపోటుని పోలి ఉంటుంది. దీని కారణంగా ఒక్కోసారి ఆయా అవయవం లేదా ప్రాణమే పోయే పరిస్థితి ఏర్పడుతుందట. ఇక్కడ కూడా ఓ మహిళ ఈ పరిస్థితితోనే దాదాపు అవయవాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో త్రుటిలో ఆ ప్రమాదం  తప్పింది.

అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలో హింగోలికి చెందిన 57 ఏళ్ల ప్రయాగ్‌బాయి శంకరరావు షిండేకు ఎండమకాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి వచ్చింది. అది కాస్తా చూస్తుండగానే ప్రాణాతక అత్యవసర పరిస్థితిగా మారింది. గంటల వ్యవధిలో ఆమె పాదం నీలిరంగులోకి మారి, వాచి చల్లగా అయిపోయింది. 

పూర్తిగా రక్తసరఫరా నిలిచిపోయింది. ఆమె కాలు శాశ్వతంగా కోల్పోయే సంకేతాలు మొదలయ్యాయి. అయితే సకాలంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో అక్కడ వైద్యులు ఆమె తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపం(అక్యూట్ లింబ్ ఇస్కీమియా)తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. 

ఇదొక తీవ్రమైన రక్తనాళాల అత్యవసర పరిస్థితి. దీనిలో గనుక చికిత్స ఆలస్యం అయితే ఆ కాలుని తీసివేయడం లేదా ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. అధునాతన ఇమేజింగ్‌లో ఆమె కాలులోని ప్రధాన ధమనులలో పూర్తి అడ్డంకి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. అయితే అప్పటికే పాదంలో ప్రీ-గాంగ్రేనస్ మార్పులు కనిపించడం మొదలయ్యాయని వైద్యులు తెలిపారు. దాంతో తాము షిండేకు ఎడమ తొడ ధమని ఎంబోలెక్టమీ (left femoral embolectomy) కోసం హుటాహుటిన శస్త్రచికిత్స చేశారు. 

ఇది ప్లంబింగ్ లాంటిది. ధమని ఎక్కడ మూసుకుపోయినా, దానిని తెరిచి రక్తం గడ్డను తొలగిస్తారు వైద్యులు. ఫలితంగా రక్తప్రసరణ పునరుద్ధరింపబడి కాలును పూర్తిగా కోల్పోకుండా కాపడతారు. అయితే షిండే కాస్త ఆలస్యంగా రావడం వల్ల కొన్ని కాలివేళ్లు అప్పటికే గ్యాంగ్రీన్‌గా (gangreanes) మారిపోయాయి, అందువల్ల వాటిని తొలగించాల్సి ఉందని అన్నారు. 

అదీగాక సదరు రోగి షిండేకి అదుపులో లేని మధుమేహం, వయస్సు సంబంధిత అథెరోస్క్లెరోసిస్ ఉండటం ఈ కేసును ప్రత్యేకంగా సవాలుగా మార్చాయి. ఈ సహ-వ్యాధులు తీవ్రమైన అవయవ ఇస్కీమియా (acute limb ischemia) ప్రమాదాన్ని పెంచడమే కాకుండా కోలుకోవడాన్ని క్లిష్టతరం చేస్తాయని అన్నారు వైద్యులు.

ఇదేలా గుండెపోటు లాంటిది అంటే..
తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపాన్ని గుండెపోటుతో పోలుస్తున్నారు వైద్యులు. గుండెపోటులో గుండె కండరాలకు రక్త సరఫరా ఎలా నిలిచిపోతుందో, అలాగే తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపంలో కూడా రక్తప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇది తీవ్రమైన నొప్పికి, కణజాల నష్టానికి దారితీస్తుంది. సాధారణంగా దీనిని తీవ్రమైన అవయవ దాడిగా కూడా పిలుస్తుంటారు. 

ప్రతి అవయవానికి పోషణ కోసం రక్త ప్రసరణ అవసరం. ధమని మూసుకుపోతే, నీరు లేని మొక్కలాగే అవయవం చనిపోతుంది. తీవ్రమైన అవయవ ఇస్కీమియా అంటే అవయవానికి రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం. తక్షణ చికిత్స లేకుండా, ఆ అవయవం జీవించలేనిదిగా మారుతుంది. ఫలితంగా అవయవంలో తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, చల్లదనం వంటి ప్రారంభ లక్షణాలను లైట్‌ తీసుకోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారిపోతుందని చెబుతున్నారు వైద్యులు. కొందరు నరాల ఒత్తిడిగా భ్రమపడి న్యూరాలజిస్టులని సంప్రదించి విలువైన సమయాన్ని వృధా చేసుకుని ప్రాణాంతకంగా మార్చుకుంటారని తెలిపారు. 

ప్రమాదం ఎవరికి ఎక్కువ అంటే..
వృద్ధ రోగులు, అదుపులో లేని మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, ధూమపానం చేసేవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ. 

చికిత్స:
సాధారణ చికిత్స ఎంబోలెక్టమీ, కానీ పెర్క్యుటేనియస్ మెకానికల్ థ్రాంబెక్టమీ వంటి అధునాతన పద్ధతులు . ఈ ప్రక్రియలో స్థానిక అనస్థీషియా ఇచ్చి, కాథెటర్ ఉపయోగించి రక్తం గడ్డను బయటకు తీస్తారు. శస్త్రచికిత్స విజయవంతమై, నష్టం తక్కువగా ఉంటే, రోగులు కేవలం రెండు లేదా మూడు రోజుల్లో నడవడం ప్రారంభించొచ్చు. సంక్లిష్టమైన కేసులలో, కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

అంతేగాదు అవయవంలో తీవ్రమైన నొప్పి, చల్లదనం వంటివి కనిపిస్తే, తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళమని సూచిస్తున్నారు వైద్యులు. సాధ్యమైనంత వరకు సమయం వృథా చేయకుండా సకాలంలో రోగ నిర్ధారణ చేయించుకుని తగిన చికిత్స పొందితే అవయవాన్ని కాపాడుకోగలమని చెబుతున్నారు వైద్యులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: పానీపూరీతో ఇంత ఆదాయం వస్తుందా..?! నెలకు ఏకంగా..)

 

Videos

భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..

ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..

వచ్చేది జగనే.. నువ్వు ఏ మాత్రం భయపడకు.. పవన్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

ఇజ్రాయెల్ ఆకాశంలో వేల సంఖ్యలో కాకులు.. ఇది వినాశనానికి సంకేతమా?

వారణాసి, స్పిరిట్ కు సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన ధురంధర్

చంద్రబాబు సొంత జిల్లాలో TDP కి అవమానం

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)