Breaking News

52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌ బ్రెష్‌..!ఐతే సడెన్‌గా..

Published on Tue, 06/24/2025 - 12:46

అనుకోకుండా ఏదైనా వస్తువుని పొరపాటున మింగితే అప్పటికీ ఎలాంటి సమస్య తలెత్తదు కొందరికి. కానీ ఒక్కోసారి అనారోగ్యం పాలైనప్పుడూ లేదా శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ తగ్గినప్పుడూ..ఆ వస్తువు ప్రాణాంతకంగా మారిపోతుంది అందుకు నిదర్శనమే ఈ ఘటన. 

అసలేం జరిగిందంటే..ఈ విచిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. యంగ్‌ అనే 64 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఇది గ్యాస్‌ నొప్పా లేక మరేదైనా అని క్షుణ్ణంగా పరిశోధించినా.. సమస్య ఏంటన్నది తేలలేదు. దీంతో అతడి జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉందా.. ? అని వైద్య పరీక్షలు చేస్తుండగా చిన్న పేగుల్లో ఒక వస్తువుని చూసి అవాక్కయ్యారు వైద్యులు. 

దాన్ని క్లియర్‌గా స్కాన్‌ చేయగా టూత్‌ బ్రష్‌ అని తేలింది. ఆ విషయమై సదరు పేషెంట్‌ యంగ్‌ని వైద్యులు ప్రశ్నించారు. అతడు తానెప్పుడో చిన్నతనంలో టూత్‌ బ్రెష్‌ మింగేసిన విషయం గుర్తు తెచ్చకున్నాడు. సుమారు 12 ఏళ్ల వయసులో టూత్‌ బ్రష్‌ని మింగేశానని, అయితే తల్లిదండ్రులు తిడతారని ఆ విషయం వారికి చెప్పలేదని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు యంగ్‌. అది విని వైద్యులే కంగుతిన్నారు. 

ఏంటీ 52 ఏళ్లుగా కడుపులోనే ఈ టూత్‌ బ్రష్‌ ఉండిపోయిందా.. ? అని ఆశ్చర్యపోయారు వైద్యులు. నిజానికి టూత్‌ బ్రష్‌ పేగుల్లోకి చేరి తిరుగుతూ కణజాలాన్ని పంక్చర్‌ చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. అలా జరిగితే పేగుల్లో చిల్లులు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. కానీ ఇక్కడ యంగ్‌ విషయంలో అదృష్టవశాత్తు టూత్‌ బ్రష్‌ పేగు వంపులో చిక్కుకుపోయి..దశాబ్దాలుగా అక్కడే ఉండిపోయిందన్నారు వైద్యులు. 

అయితే ఇది ఇప్పుడు పేగుల్లో కదలడం మొదలవ్వడంతోనే.. యంగ్‌ విపరీతమైన కడుపునొప్పిని అనుభవించినట్లు తెలిపారు. అయితే వైద్యులు చాలా గంటలు శ్రమించి ఆ టూత్‌ బ్రష్‌ని విజయవంతంగా కడుపులోంచి వేరు చేశారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు ఐదు దశాబ్దాలుగా టూత్‌బ్రష్‌తోనే జీవించాడా వ్యక్తి.. ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు అతడికి ఎటువంటి హాని కలిగించకపోవడం అనేది నిజంగా అదృష్టం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: యవ్వనంగా ఉండాలంటే.. చర్మంపై ఫోకస్‌ తప్పనిసరి..!)
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)