50 ఏళ్ల సహోద్యోగి అలా ప్రవర్తిస్తే ఏం చేయాలి..!

Published on Thu, 12/11/2025 - 13:55

ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు, చిన్న చిన్న గొడవలు కామన్‌గానే ఉంటాయి. అవి వర్క్‌ పరంగానే తప్ప వ్యక్తిగతంగా కాదు కాబట్టి..అక్కడున్నంత సేపే గుర్తించుకుంటాం. ఆ తర్వాత వదిలేస్తాం. కానీ కొందరు కాస్త చొరవ తీసుకుని అసౌకర్యానికి గురిచేసేలా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా మహిళపట్ల కొందరు మగ ఉద్యోగులు ప్రవర్తన డిఫెరెంట్‌గా ఉంటుంది. అలా కాకుండా 50 ఏళ్ల వ్యక్తి వయసుకు తగ్గట్టుగా కాకుండా కుర్రాడిలా ప్రవర్తిస్తే ఎవ్వరికైన చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది ఓ టెక్‌ కంపెనీలో పనిచేస్తున్న వివాహిత.

ఆమె పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది.  మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న 22 ఏళ్ల మహిళ 50 ఏళ్లకు పైనే ఉండే సహోద్యోగితో తనకెదురైన అసౌకర్యమైన క్షణాన్ని పోస్ట్‌లో షేర్‌ చేసుకుంది. తామెప్పుడు చాలా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. మేనేజ్‌మెంట్‌ మీటింగ్‌లు ముగిసిన వెంటనే కంపెనీయే ఫ్రీగా స్నాక్స్‌ పెట్టడం జరుగుతుంది. దానిని తాము షేర్‌ చేసుకునేవాళ్లం. అలాగే ఏదైనా విషయం ఉన్న మైక్రోసాఫ్ట్‌ టీమ్‌లో చాట్‌ చేసుకునేవాళ్లం. 

అవన్నీ పనిలో భాగంగా చాలా సాధారణమే. అందువల్ల స్నేహపూర్వకంగానే ఇదంతా అనే భావించా. కానీ ఒక వారం తర్వాత పెళ్లిచేసుకుని వచ్చాక ఒక్కసారిగా అతడి తీరు మారిపోయింది. రోటీన్‌గా ఇదివరకిటిలా స్నాక్స్‌ షేర్‌ చేయడం అన్ని చేశారు. అక్కడ వరకు అంతా బాగానే ఉన్నా..సడెన్‌గా గ్రూప్‌లో మెసేజ్‌ల పరంపర డిఫెరెంట్‌గా మొదలైంది. ఆరోజు జరిగే పనుల గురించి జోక్‌ చేయడం నుంచి కాస్త విభిన్నంగా మాట్లాడాడు. దాన్ని కూడా తేలిగ్గా తీసుకున్నానంటూ తన గోడును చెప్పుకొచ్చిందామె. 

డిసెంబర్‌ 30కి ముందు రోజు అదనపు షిఫ్ట్‌ల అనంతరం అతడి స్వరంలో మార్పులు స్పష్టంగా గమనించాను. అతడు ఓ పెద్దాయనలా ప్రవర్తించడం లేదనిపించింది. మన ఇద్దరం మంచి ఫుడ్‌లవర్స్‌ కాబట్టి ఎప్పుడైనా సరదా వీలుకుదిరితే డిన్నర్‌కి ప్లాన్‌ చేద్దామా అని అడిగాడు. ఒక్కసారిగా ఆ మాటకు హుతాశురాలినయ్యానంటూ..తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని షేర్‌ చేసుకుంది. 

అంతేగాదు అతడి ఆహ్వానాన్ని రిజెక్ట్‌ చేసి దూరంగా ఉంచాలా, యాజమాన్యానికి ఈ ఘటన గురించి వివరించాలో సలహా ఇవ్వమని కోరింది పోస్ట్‌లో. అయితే నెటిజన్లు..ఆ ఆహ్వానానని తిరస్కరించండి. అతడి ఆలోచన తీరు సరిగా లేదు..సున్నితంగా రిజెక్ట్‌ చేసి దూరంగా ఉండటమే మంచిది అంటూ పోస్టులు పెట్టడం గమనార్హం. 

(చదవండి: ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్ తగ్గిపోతుందా..? ఆ హాస్య నటుడు ఏకంగా 78 కిలోలు తగ్గి..)
 

Videos

‘మధ్యలో ఏంటి బాసూ’ గజరాజుకు కోపం వచ్చింది

ఆరు నూరు కాదు.. నూరు ఆరు కాదు.. పెమ్మసానికి అంబటి దిమ్మతిరిగే కౌంటర్

సర్పంచ్ అభ్యర్థుల పరేషాన్

ఇకపై మంచి పాత్రలు చేస్తా

హోటల్ లో టమాటా సాస్ తింటున్నారా జాగ్రత్త!

ఘరానా మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. 25 కోట్లు గోల్ మాల్

నేనింతే.. అదో టైప్.. నిజం చెప్పను.. అబద్దాలు ఆపను..

టెండర్లలో గోల్ మాల్.. కి.మీ.కు ₹180 కోట్లు !

మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్య

కోల్ కతాలో హైటెన్షన్.. స్టేడియం తుక్కు తుక్కు

Photos

+5

పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ ఆదా శర్మ.. ఫోటోలు

+5

మెస్సీ మ్యాచ్‌.. ఫ్యాన్స్‌ జోష్‌! (ఫొటోలు)

+5

18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)

+5

మ్యాచ్ ఆడ‌కుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ ర‌చ్చ‌ (ఫోటోలు)

+5

రజనీకాంత్ బర్త్ డే.. వింటేజ్ జ్ఞాపకాలు షేర్ చేసిన సుమలత (ఫొటోలు)

+5

గ్లామరస్ మెరుపు తీగలా యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

చీరలో ట్రెడిషనల్‌ లుక్‌లో అనసూయ.. ఫోటోలు వైరల్‌

+5

కోల్‌కతాలో మెస్సీ మాయ‌.. (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (ఫొటోలు)

+5

#RekhaNirosha : నటి రేఖా నిరోషా బ్యూటిఫుల్ (ఫొటోలు)