Breaking News

ఆ హైజాక్‌ ఘటన..మా అమ్మ ఫ్లైట్‌ జర్నీలకు బ్రేక్‌ వేయలేదు!

Published on Tue, 09/08/2026 - 13:08

ఒక్కోసారి కొన్ని ప్రయాణాలు భయానక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎంతలా అంటే ఓ పట్టాన తేరుకోలేం. ఇంకోసారి అలాంటి జర్నీలు చేసే సాహసం కూడా చేయం. కానీ ఈ మహిళ టీనేజ్‌ వయసులో భయానక హైజాకింగ్‌ ఘటన ఎదుర్కొంది. క్షణం, క్షణం ఉత్కంఠ రేపే ఆ ఘటనలు బతికున్నంత వరకు మర్చిపోని విషాదం అది. అయినా..అది తన జర్నీలకు బ్రేక్‌ వేయలేదంటూ తన కథను సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. నెటిజన్లు ఆమె స్టోరీని అద్భుతమైన స్ఫూర్తిదాయక కథ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఢిల్లీకి చెందిన కంటెంట్‌ క్రియేటర్‌ రోహన్‌ శర్మ తన తల్లి అద్భుతమైన కథను ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో పంచుకున్నారు. పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్‌ ఘటన జరిగి 40 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. తన తల్లికి 15 ఏళ్ల వయసున్నప్పుడు సెలవుల తర్వాత ఢిల్లీ నుంచి ఒంటరిగా అమెరికాకు వెళ్తుండగా ఈ దురుదృష్టకర ఘటనను ఎదుర్కొందని తెలిపాడు. ఇన్నేళ్లయినా..ఆ భయనాక క్షణాలు తనను ఇంకా వెంటాడుతూనే ఉన్నా..విమానా ప్రయాణాలు ఆపలేదని ధీమాగా చెబుతున్నాడు. ఆ విషాద ఘటన తన అమ్మకు ప్రపంచాన్ని చూడాలనే కలను దూరం చేయలేకపోయిందని అంటున్నాడు.  

కరేబియన్‌లో స్కూబా డైవింగ్ చేయడం, స్విస్ ఆల్ప్స్‌లో స్కీయింగ్ చేయడం, పోర్చుగల్ జలాల్లో ఈత కొట్టడం వరకు ప్రతి సాహసాన్ని ఆస్వాదిస్తోంది. పైగా కోలుకోవడం అంటే మర్చిపోవడం కాదని జీవించడం అని నిరూపించిందని గర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు తను ఆ గాయం తనని నిర్దేశించకూడదని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యింది అందువల్లే ఈ సాహసకృత్యాలను చేయగలిగింది, మంచి అనుభవాల్ని సంపాదించుకుందని చెబుతున్నాడు. ఇక ఆమె తల్లి కూడా ఆనాటి విషాద దృశ్యాలు తన మనసులో గాఢంగా ముద్రపడిపోయాయని, అవి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయన్నారామె. 

తనలా నాటి పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లు కోలుకున్నారా లేదా అని ఆలోచిస్తుంటానని చెబుతోందామె. అయితే తాను టీనేజ్‌ వయసులో ఎదుర్కొన్న ఆ గాయాన్ని తనను శాసించకూడదని అనుకున్నా కాబట్టి ఇవన్నీ చేయగలిగానని అంటోందామె. అలాగే ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. తనెలా బయటపడిందో పంచుకుంది. ‘పాన్ ఆమ్ ఫ్లైట్ 73 హైజాక్‌కు గురైంది. ప్రయాణికులు సుమారు 16 గంటల పాటు బందీలుగా ఉంచారు. హైజాకర్లు కాల్పులు జరపడానికి ముందు ప్రయాణికులను విమానం మధ్యలోకి తీసుకువెళ్లారని, ఇంతలో మరో ప్రయాణికురాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తెరవడంతో దానిగుండా తాను బయటపడినట్లు తెలిపింది. 

అయితే లోపల కాల్పుల శబ్దానికి బిగుసుకుపోయి విమానం రెక్కపై ఉండిపోయానని, ఇంతలో సన్‌షైన్ అనే ఫ్లైట్ అటెండెంట్ విమానం రెక్కపై నుంచి నెమ్మదిగా కిందకు దించిందంటూ నాటి విషాదాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది’. అయితే తాను శారీరకంగా ఎలాంటి గాయాలవ్వకుండా సురక్షితం బయటపడ్డప్పటికీ..ఆ ఘటనలో సుమారు 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. 

అది నిజంగా ఎవ్వరి జీవితాన్ని అయినా ప్రభావితం చేసే భయానకమైన బాధకర ఘటనగా అభివర్ణించిందామె. అయితే తాను దాన్నుంచి బయటపడి ధైర్యంగా ముందుకు సాగాలనుకున్నా..కాబట్టి విమాన ప్రయాణాలకు బ్రేక్‌ పడలేదని నవ్వుతూ చెబుతుంది. అంతేగాదు ఇలాంటి అనుభవం పొందిన వాళ్లు ఎవ్వరైనా తెలుసుకోవాల్సింది ఏంటో తన అనుభవంతో గొప్ప పాఠాన్ని నేర్పిందామె. నెటిజన్లు కూడా హ్యాట్సాఫ్‌ మేడం..అద్భుతమైన కథ అంటూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఏఐ టూత్‌ బ్రెష్‌..దెబ్బకు నోటి సమస్యలకు చెక్‌!)

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)