Breaking News

సివిల్స్‌లో ఇల్లాలి అపూర్వ విజయం..! వైకల్యాన్ని జయించి..

Published on Wed, 05/07/2025 - 09:20

ఇరవైలలో సివిల్స్‌కు శ్రీకారం చుట్టడం సాధారణ విషయం. కేరళకు చెందిన నిశా 

 మాత్రం 35వ యేట ప్రిపరేషన్‌ మొదలు పెట్టింది. వినికిడి సమస్య ఉన్న నిశా ఏడవ ప్రయత్నంలో, 40 సంవత్సరాల వయసులో సివిల్స్‌లో విజయం సాధించింది. తిరువనంతపురంలోని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా పనిచేసేది నిసా ఉన్నిరాజన్‌. నందన (11), తన్వీ(7) ఆమె కుమార్తెలు. భర్త అరుణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 35 ఏళ్ల వయసులో సివిల్స్‌కు సిద్ధం అవుతున్నప్పుడు... 

‘ఈ వయసులో కష్టం’ ‘ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సివిల్స్‌లో సక్సెస్‌ కావడం కష్టం’... ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. భర్త అరుణ్‌ మాత్రం ప్రోత్సహించాడు.వినికిడి సమస్య వల్ల సివిల్స్‌ ప్రిపరేషన్‌లో నిసాకు సమస్యలు ఎదురయ్యేవి. సబ్జెక్ట్‌కు సంబంధించిన ఆడియోలు వినడం కష్టం అయ్యేది. ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరోవైపు ప్రిపరేషన్‌ కోసం టైమ్‌ కేటాయించుకునేది. ‘వినికిడి సమస్య ఉన్న నువ్వు సివిల్స్‌కు ఎలా ప్రిపేరవుతావు!’లాంటి ఎగతాళి మాటలు వినాల్సి వచ్చేది.

ఆమె కష్టం వృథా పోలేదు. నలభై ఏళ్ల వయసులో యూపీఎస్‌సీ–2024 పరీక్షలో 1000వ ర్యాంక్‌ సాధించింది. 40 శాతం వినికిడి లోపం ఉన్న నిశా తన వైకల్యాన్ని ఎదుర్కొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే విజయం సాధించింది.

కొట్టాయం డిప్యూటీ కలెక్టర్‌ రంజిత్‌ నుంచి నిశా స్ఫూర్తి పొందింది. వినికిడి సమస్య ఉన్న రంజిత్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సివిల్స్‌లో విజయం సాధించాడు. ‘మీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నా కుమార్తెలకు నిరూపించి చూపాలనుకున్నాను. మనకు ఉన్నది ఒకే జీవితం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోవద్దు’ అంటుంది నిశా. 

(చదవండి: చిన్నారులకు వంశవృక్షం తెలియాలి..! కనీసం ఓ మూడు తరాలు..)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)