Breaking News

మేఘాలను గమనిస్తూ, వీడియోలు తీస్తూ..నెలకు రూ. 8.5 లక్షలు!

Published on Thu, 08/20/2026 - 11:13

పనిప్రదేశం, ఆఫీస్‌ డెస్క్‌లు, టార్గెట్‌లు లేకుండా ప్రకృతితో మమేకమై ఉద్యోగం అంటే అబ్బా అని ఎగిరిగంతేస్తాం. అయినా అలాంటి ఉద్యోగం ఎక్కడుంటుంది అని కొట్టిపారేయకండి. అలాంటి గొప్ప ఉద్యోగం కూడా ఉంది. పైగా జీతం ఎంతో తెలిస్తే..వామ్మో అని ఉబ్బితబ్బిబవ్వడం ఖాయం. ఇంతకీ ఏంటా జాబ్‌..? ఏం పని చేయాల్సి ఉంటుందంటే..

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లావోజున్ పర్వత సుందర ప్రాంతం ఒక అసాధారణమైన ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఆ ఉద్యోగానికి  "క్లౌడ్‌స్కేప్ అబ్జర్వర్" అని పేరు పెట్టి మరి దరఖాస్తులకు ఆహ్వానించింది. ఎంపికైన వ్యక్తి జూలై 16 నుంచి ఆగస్టు 15 వరకు పర్వతంపై ఉండి మారుతున్న మేఘాలను, ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించి రోజువారీ వీడియోలు పంచుకోవాల్సి ఉంటుంది. అంఉకోసం నెలకు సుమారు రూ. 8.5 లక్షలు దాక చెల్లిస్తారట. అంతేకాదండోయ్‌ వసతి కూడా కల్పిస్తారట. 

ఈ ఆఫర్‌ చైనాలో చాలామంది నిరుద్యోగ యువతను ఆకర్షించింది. దీన్ని చాలామంది డ్రీమ్‌ జాబ్‌గా, దేవతా ఉద్యోగంగా అభివర్ణిస్తూ..ఈ ఉద్యోగాన్ని ఎలాగైన కొట్టేయాలని ఉవ్విళ్లూరారు. అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు నిర్దేశించిన హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి వీడియోలను సమర్పించాల్సి ఉంటుంది. సదరు సుందరమైన ప్రాంతం నిర్వాహకులు పంపిన కంటెంట్‌ నాణ్యతకు వచ్చిన స్పందనను పరిగణలోనికి తీసుకుని ఎంపిక చేస్తుందట. ఈ ఉద్యోగానికి సుమారు మూడు వేలకు పైగా దరఖాస్తు చేసుకోగా, హెనాన్‌కు చెందిన 23 ఏళ్ల లీ సిచెన్‌ అనే వ్లాగర్‌ ఎంపికయ్యాడు. అతను @xiaozao అనే హ్యాండిల్‌ను ఉపయోగిస్తాడు. అతను లావోజున్ పర్వతం నెం 001 క్లౌడ​స్కేప్‌ అబ్జర్వర్‌గా ఎంపికయ్యాడు. అతని దరఖాస్తు వీడియోకు బలమైన స్పందన వచ్చింది. 

అలాగే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లతో సహా ఇతర దరఖాస్తుదారులకు విభిన్నంగా తన పనితీరుని చాటాడు. ఇక సదరు యువకుడు లీ ఇటీవలే ఈ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. నిజానికి ఈ ఉద్యగోం విశ్రాంతి, ఆహ్లాదాన్ని ఇచ్చే ఉద్యోగంలా ఉంటుంది కానీ అతడి పనిదిన సూర్యోదయానికి ముందే మొదలవుతుంది. అలాగే సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది. ఇక్కడ రోజులో వివిధ సమయాల్లో వివిధ కోణాల నుంచి ఎక్కువ ఫుటేజ్‌లు చిత్రీకరించడమే అతడి టార్గెట్‌. ఆ అందమైన ప్రాంతం ఆన్‌లైన్‌ కంటెంట్‌ కోసం అతను మేఘాలు, పొగమంచు, పర్వత దృశ్యాలు, కాంతి ప్రదర్శనలు చిత్రీకరించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఈ పని లీకి కొత్త సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడింది. 

అలాగే ఈ ఉద్యోగంలో తెలియని ఒక రకమైన ఒత్తిడిన ఎదుర్కొనక తప్పదు కూడా. అదేంటంటే తన వీడియోలు క్లిక్‌ అవుతాయో లేదో అనే భయం వెంటాడుతూ ఉంటుందట. ఏ వీడియో కంటెంట్‌ ద్వారా ఉద్యోగాన్ని సంపాదిచుకున్నాడో..అంతే స్థాయిలో ప్రతిసారి కంటెంట్‌ క్రియేట్‌ చేయడం అంటే విపరీతమైన ఒత్తిడితో కూడిన పనే అని చెప్పొచ్చు. ఒక్కోసారి ప్రతికూల పరిస్థితుల వల్ల ఫోటోలు చక్కగా రావు. 

నిరంతరం వాతారణ పరిస్థితులను తట్టుకుంటూ ఫోటోలు చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా..నెల మొత్త విజయవంతంగా చిత్రీకరణ కొనసాగించడం విశేసం. ముగింపు సమయంలో ఇట్టే నెల గడిచిపోతుందని అంటున్నాడు లీ. అంతేగాదు ఆ నెల లావోజున్ పర్వతం వద్ద గడిపిన లీ కూడా ఆన్‌లైన్‌ బాగా ఫేమస్‌ అయ్యాడు. అతడు ఆ పర్యాటక ప్రదేశం వీడియోల తోపాటు ఆ క్రమంలో తను ఎదుర్కొన్న కష్టాలను, ఇబ్బందులను కూడా షేర్‌ చేసుకున్నాడు. 

ప్రత్యేకంగా ఇలా కంటెంట్‌ క్రియేటర్‌ ఎందుకంటే..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఆ పర్యాటక ప్రదేశంలో ఇప్పటికే పూర్తి-కాలం పనిచేసే వీడియో మేకర్లు ఉన్నారు. అలాంటప్పుడు, ఇలా ప్రత్యేకంగా కంటెంట్‌ క్రియేటర్లు ఎందుకు అంటే..లావోజున్ పర్వతానికి చెందిన జాంగ్ అనే ప్రతినిధి మాట్లాడుతూ.. తమ పర్యాటక ప్రదేశానికి ఒక కొత్త దృక్కోణం కావాలని కోరుకున్నట్లు చెప్పారు. జాంగ్ ఆ పరిశీలకుడిని "మూడవ కన్ను"గా వర్ణించారు. భవిష్యత్తులో ఇలా క్లౌడ్‌స్కేప్ పరిశీలకులను మళ్లీ నియమించుకోవచ్చని ఆ ప్రతినిధి తెలిపారు.

కాగా, ఈ లావోజున్ పర్వతం మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లువాన్‌చువాన్ కౌంటీలో ఉంది. ఈ పర్వతం దాని 'మేఘాల సముద్రం'కు ప్రసిద్ధి చెందింది. ఇది చైనాలో ప్రసిద్ధి చెందిన టావోయిస్ట్ పర్వతాలలో ఒకటి. ఇది రెండు వేల ఏళ్లకు పైగా చరిత్రను కలిగి ఉంది. అంతేగాదు పర్యాటక ఆర్షణ రేటింగ్‌ వ్యవస్థలో దీనికి  5A-రేటింగ్ ఉండటం గమనార్హం.

(చదవండి: సరిహద్దులు దాటిన ప్రేమ..! స్కాటిష్‌ ఎంపీని పెళ్లాడిన భారతీయ మహిళ)

 

Videos

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

మీరు అసలు మనుషులా రాక్షసులా.? పసి బిడ్డను చంపేస్తారా.? టీచర్ పై పేరెంట్స్ రియాక్షన్

తల్లి, కూతురి మధ్య బంధం తెగిందా..?

YSRCP అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్

DSC కుంభకోణంలో సంచలన నిజాలు బయట పెట్టిన అభ్యర్థి

రోడ్డు పక్కన కారు.. డిక్కీలో యువతి డెడ్ బాడీ..!

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)