Breaking News

ఇదే ఆఖరి దీపావళి పండుగ..! మళ్లీ ఏడాది..

Published on Thu, 10/16/2025 - 17:58

దీపావళి పండుగ అంటే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంజాయ్‌ చేస్తారు. అలాంటి పండుగను ఈ యువకుడు ఇదే తనకు ఆఖరి దీపావళి ఏమో అంటూ భావేద్వేగంగా పోస్టు పెట్టాడు. హృదయాన్ని మెలిపెట్టే అతడి కథ నెట్టింట వైరల్‌గా మారడమే కాదు ప్రతి ఒక్కరిని కదిలించింది. పైగా బ్రో నీకేంకాదు అంటూ..ధైర్యం చెబుతూ పోస్టులు వెల్లువెత్తాయి. 

అసలేం జరిగిందంటే..21 ఏళ్ల వ్యక్తి హృదయ విదారక పోస్ట్‌ నెట్టింట ప్రతి ఒ‍క్కరిని కంటతడిపెట్టేలా చేసింది. ఆ పోస్ట్‌లో అంతలా ఏముందంటే..అతడు 2023 నుంచి స్టేజ్‌4 కొలొరెక్టల్‌ కేన్సర్‌(colorectal cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. నెలలతరబడి కీమోథెరపీలు, ఆస్పత్రుల్లో గడిపిన తదనంతరం వైద్యులు ఈ ఏడాదికి మించి బతకలేడని నిర్థారించారని షేర్‌ చేసుకున్నాడు. 

"దీపావళి పండుగ సమీపిస్తుండటంతో బహుశా ఇదే నా చివరి దీపావళి పండుగ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. త్వరలో దీపావళి రాబోతోంది అంతా దీపాలు వెలిగించి..సందడిగా ఉంటే..తన హృదయ దీపం ఆరిపోయి..జీవితం ముగిసిపోనుంది అని భావోద్వేగంగా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. నా జీవితం ముగిసిపోతుంది అని తెలిసి కూడా ఎలా సాగుతుందో చూడటం వింతగా ఉంది. వచ్చే ఏడాది నా స్థానంలో మరొకరు దీపాలు వెలిగిస్తారు. 

సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, ఓ కుక్కను పెంచుకోవాలనుకున్నా నా కల, ఆకాంక్షలు అన్ని జారిపోతున్నట్లుగా ఉంది. ఆలోచనలన్నీ మసకబారుతున్నాయి. నా తల్లిదండ్రుల ముఖాలో తీవ్ర దుఃఖం కనిపిస్తుంది. అయినా ఇదంతా నేనెందుకు పోస్ట్‌ చేస్తున్నానో కూడా నాకు నిజంగా తెలియదు. బహుశా నిశబ్దంగా వెళ్లిపోవడం ఇష్టం లేక ఇలా పోస్ట్‌లో బిగ్గరగా చెప్పలనేమో." అంటూ తన పోస్ట్‌ని ముగించాడు. 

ఈ పోస్ట్‌ నెట్టింట వేలాదిమంది నెటిజన్ల హృదయాలను తాకింది. చాలామంది ఉన్న సమయం ఉపయోగించుకోండి, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇవ్వగా మరికొందరూ మాత్రం ఏదైనా మిరాకిల్‌ జరగొచ్చు కేన్సర్‌ మీ నుంచి దూరంగా వెళ్లిపోవచ్చు అని ఆశను రెకెత్తించేలా పోస్టుల పెట్టారు.  

(చదవండి: జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్‌ని తలపించేలా..)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)