Breaking News

మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!

Published on Thu, 01/16/2025 - 14:12

అత్యంత కాలం బతికిన శతాధిక వృద్ధులను చూస్తే..వారి ఆరోగ్య రహస్యం ఏంటని కుతూహలంగా ఉంటుంది. వారి దీర్ఘాయువుకి కారణం.. క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని క్లియర్‌గా స్పష్టమవుతోంది. ఇంతవరకు జపాన్‌, బ్రెజిల్‌లోని శతాధిక వృద్ధ మహిళలు, వారి హెల్త్‌ సీక్రెట్‌ల గురించి విన్నాం. ఇప్పుడు వారందర్నీ వెనక్కినెట్టి అత్యంత శతాధిక వృద్ధురాలికి నిలిచి ఆశ్చర్యపరుస్తోంది ఈ చైనా బామ్మ. 

అయితే ఈ బామ్మ ఇప్పటికీ తన పనులను తానే చేసుకుంటోందట. మిగతా శతాధిక వృద్ధ బామ్మల మాదిరిగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో జాయిన్‌ అవ్వకపోవడం విశేషం. అయితే ఈ బామ్మ ఆరోగ్య రహస్యం ఏంటో తెలిస్తే విస్తుపోవడం ఖాయం. 

ఆ బామ్మ ఎవరంటే..
చైనా(China)కు చెందిన క్వి చైషి(Qiu Chaishi) అనే బామ్మ. ఆమె వలసవాద సెమీ ఫ్యూడల్ పాలనకు గుర్తుగా నాటి క్వింగ్ రాజవంశ పాలకుల హయాంలో 1901లో జన్మించింది. జనవరి 1న 124వ పుట్టిన రోజున జరుపుకుంది. అప్పుడే రుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న నాన్‌చాంగ్ నగరం అత్యంత శతాధిక వృద్ధులలో ఆమె కూడా ఒకరిగా క్విచైషి బామ్మను గుర్తించింది.

ఆమెకు ఏకంగా 60 ఏళ్ల వయసున్న మనవరాలు ఉంది. తన తరంలోని అత్యంత చిన్న కుటుంబ సభ్యురాలు వయసు ఎనిమిది నెలల చిన్నారి అట. ఇక ఆమె సుదీర్ఠకాల ఆరోగ్యం రహస్యం ఏంటంటే..

హెల్త్‌ సీక్రెట్‌..
తన సుదీర్ఘకాల(Longevity) జీవన రహస్యం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని నమ్మకంగా చెబుతోంది. రోజూ మూడుపూటల భోజనం(Lard Rice) చేస్తుందట. అయితే భోజనం తర్వాత నడక(Walks) తప్పనిసరి అని చెబుతోంది క్విచైషి. అలాగే రాత్రి 8 కల్లా నిద్రపోతుందట. ఇప్పటకీ తన పనులన్నీ చకచక చేసుకుంటుందట. తల దువ్వుకోవడం దగ్గర నుంచి స్టవ్‌ వెలిగించడం, పెంపుడు జంతువులను పెంచడం, మెట్లు ఎక్కడం తదితర అన్ని పనులను సునాయాసంగా చేసేస్తుందట. 

తనకు ఇష్టమైన వంటకాల గురించి కూడా షేర్‌ చేసుకుంది. ఆమెకు గుమ్మడికాయ, శీతాకాలపు పుచ్చకాయ, మొక్కజొన్న పిండితో చేసే గంజి, పందికొవ్వు అంటే మహా ఇష్టమట. కానీ పంది కొవ్వుని మాత్రం వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకుంటున్నట్లు తెలిపింది. నిజంగా ఈ బామ్మ ఆరోగ్యపు అలవాట్లు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈ బామ్మ మాములు గ్రేట్‌ కాదు, అంతకు మించి అని ప్రశంసించకుండా ఉండలేం కదా..!.

(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!)

 

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి