Breaking News

బుల్లి ఫ్యాషన్‌ డిజైనర్‌..! జస్ట్‌ పదేళ్లకే..

Published on Tue, 03/03/2026 - 17:06

ఫ్యాషన్‌ డిజైనర్‌ అవ్వడం అంత ఈజీకాదు. ఆ రంగం ఎంత ఇష్టమైనా.. దానిలోని మెళుకువలపై పట్టు సాధించేది మాత్రం టీనేజ్‌ వయసుకే. అంతకంటే చిన్న వయసులో అంత సులభం కాదు..పైగా క్లాత్‌ని పట్టుకుని కుట్టుగల నేర్పరితనం, క్రియేటివిటీ ఉండదు. కానీ ఈ బుడతడు..పిట్ట కొంచెం కూత ఘనంలా అలవోకగా పలు రకాల ఫాబ్రిక్‌లను అందమైన డిజైనర్‌వేర్‌లా తీర్చిదిద్దుతుండటం విశేషం. అంతేకాదండోయ్‌ ఏకంగా ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ వీక్‌లో దిగ్గజ డిజైనర్ల మధ్య..తన ఫ్యాషన్‌వేర్‌ని ప్రదర్శించనున్నాడు కూడా. ఇలా అత్యంత పిన్నవయసులో ఫ్యాషన్‌ డిజైనర్‌గా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనున్న చిన్నారిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఆ చిన్నారి ఎవరంటే..

ఆ చిచ్చర పిడుగే మాక్స్ అలెగ్జాండర్. ఆ చిన్నారి తల్లిదండ్రులు జాక్ అలెగ్జాండర్, షెర్రీ మాడిసన్ దంపతులు. పూర్తిగా భాషై పట్టు రాని ఆ వయసుకే ఈ బాలుడు మాక్స్‌ స్కెచ్‌ పట్టుకుని డిజైన్లు, సూది దారం సాయంతో చక్కటి కళ్లు చెదిరిపోయే ఫ్యాషన్‌వేర్లను క్రియేట్‌ చేసేస్తాడు. 

తనలోని ఫ్యాషన్‌ క్రియేటివిటీ తన సోదరి సమంత కారణంగా బయటకు వచ్చిందట. ఆమెకు ప్రస్తుతం 14 ఏళ్లు. తాను తయారు చేసిన డిజైనర్‌వేర్‌లన్నీ తన అక్క కోసమేనని, ఆమె వాటిని ధరించి చూడటం నిజంగా చాలా ఆనందాన్నిస్తుందని చెబుతున్నాడు మాక్స్‌.  

అతడి క్రియేటివిటీ అత్యంత విభిన్నం..
ఫ్యాషన్‌ డిజైనర్లు ముందుగా తమ క్రియేటివిటీ లేదా ఆలోచనను కాగితంపై స్కెచ్‌తో పని చెబితే..మాక్స్‌ మాత్రం ముందుగా దాన్ని మడతలతో కట్టి చూస్తాడు. ఆ తర్వాత ముక్కలుగా కట్‌ చేసి కుట్టేస్తాడు. తనకు డ్రేపింగ్‌ అంటే ఇష్టమని, ముందుగా ధరిస్తేనే..క్రియేటివిటీ తళుక్కుమని బుర్రలో ప్రత్యక్షమవుతుందని చెబుతున్నాడు మాక్స్‌. అలా ఇప్పటివరకు ఈ చిన్నారి 150కి పైగా డిజైనర్‌వేర్‌లు రూపొందించాడు. వాటిలో దుస్తులు, జాకెట్లు, స్కార్ఫ్‌లు, బ్యాగులు, కిమోనోలు, సూట్లు, స్టఫ్డ్ యానిమల్స​ కూడా ఉన్నాయి. 

అంతేగాదు తన సొంత రన్‌వే షోను ప్రదర్శించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్‌ రికార్డు కూడా నెలకొల్పాడు. 2024లో ఎనిమిదేళ్ల వయసులో ఐక్యరాజ్యసమితలో ఫ్యాషన్‌ స్థిరత్వంపై ప్రసంగించాడు. వ్యర్థాలను పునర్వినియోగం చేసి.. దుస్తులుగా ఎలా మలచొచ్చో ఆలోచనాత్మకంగా వివరించాడు. పైగా దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేలా కాఫీ బీన్ బ్యాగ్‌ల నుంచి రూపొందించిన డిజైనర్‌వేర్‌లలో మెరిశారు మోడళ్లు. 

అలాగే ఆ చిన్నారి మాక్స్‌ చదువుకుంటూనే ఫ్యాషన్‌ వీక్‌లలో తన ప్రదర్శనలను ఇస్తుంటాడు. ఇదేగాక మాక్స్‌కి పలు స్కిల్‌ కూడా ఉన్నాయి. అవేంటంటే వంట చేస్తాడు, పికిల్‌బాల్‌, టెన్నిస్‌ వంటివి ఆడతాడు, కథలు రాస్తాడు. అలాగే తనకొక రెస్టారెంట్‌, కారు వాష్‌ని ఉండాలని కలలుకంటుంటాడు. పైగా ఇంజనీర్‌ కావలన్నిది అతడి ధ్యేయం కూడా. 

ఇక మాక్స్‌ తన పాఠశాల చదువుకి ఆటంకం లేకుండా వారాంతాల్లో ఫ్యాషన్‌కి సంబంధించిన స్కిల్స్‌లో నిమగ్నమవుతుంటాడట. నిజంగా పెన్సిల్‌ పట్టుకుని కుదురుగా బొమ్మలు వేయని ఆ చిరుప్రాయంలో ఇంత అసామాన్య ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రతిభ మాటలకందనిది కదూ..!.

వీడియోపై క్లిక్‌ చేయండి

(చదవండి: తనకు తాను ఓటు వేసుకుని మేయర్‌ అయిన మహిళ..! ఎక్కడంటే..)

 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)