Breaking News

‘వక్ఫ్‌’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌

Published on Mon, 04/14/2025 - 17:01

తాడేపల్లి,సాక్షి: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌ దాఖలు చేసింది. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకంగా వైఎస్సార్‌సీపీ ఓటు వేసిన విష‌యం తెలిసిందే. మైనారిటీ సమాజానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంద‌ని  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఇందులో భాగంగా వక్ఫ్‌ సవరణ బిల్లును ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో వైఎస్సార్‌సీపీ వ్య‌తిరేకించింది. గ‌తంలోనే వక్ఫ్‌ సవరణ బిల్లుపై వైఎస్సార్‌సీపీ  అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేసింది. మళ్లీ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్ట‌డంతో లోక్‌స‌భ‌, రాజ్యసభలో వ‌క్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఓటేశారు.  

ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం’ అని  సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వైఎస్సార్‌సీపీ పేర్కొంది.

వక్ఫ్ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన YSRCP

కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో వక్ఫ్‌ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఉభయ సభల్లో  ఈ బిల్లు పాస్‌ కావడంతో పాటు ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ సవరణ బిల్లు చట్టు రూపం దాల్చింది. దీనిని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవ్వగా,  తాజాగా వైఎస్సార్ సీపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. 

అందుకే వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో సవాల్ 
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టం చేశారు. అందుకే వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13,14,25,26లను ఉల్లంఘిస్తోంది. ప్రాథమిక హక్కులు, సమానత్వం, మత స్వేచ్చలకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని మతాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉంది. ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చటం వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటమే. ఈ నిర్ణయం వక్ఫ్ బోర్డు పరిపాలన స్వాతంత్య్రాన్ని దెబ్బ తీస్తోందని వైఎస్సార్‌సీపీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)