Breaking News

నిందితులపై ఎన్‌ఐఏ ప్రశ్నల వర్షం

Published on Thu, 11/20/2025 - 16:04

న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద బాంబుపేలుడు ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణను మరింత వేగవంతంచేసింది. జమ్మూకశ్మీర్‌ పోలీసులు కస్టడీలో ఉన్న నిందితులు డాక్టర్‌ ముజామిల్‌ ఘనీ, అదీల్‌ రాఠర్, వైద్యురాలు షాహీనా సయీద్, మత బోధకుడు ఇర్ఫాన్‌ అహ్మద్‌ వగాయ్‌లను ఎన్‌ఐఏ గురువారం తమ కస్టడీలోకి తీసుకుంది. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. 

ఫరీదాబాద్‌ ఉగ్రమాడ్యూల్‌ సభ్యులు ఎలా అఫ్గాన్, పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్, తుర్కియేలోని హ్యాండ్లర్లతో సత్సంబంధాలు పెట్టుకున్నారు? నిధులు ఏఏ మార్గాల్లో సంపాదించారు? విధ్వంసకర రచన చేసిందెవరు? వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రమాడ్యూల్‌లో వాస్తవంగా ఎంత మంది సభ్యులు ఉన్నారు? అంటూ ప్రశ్నలవర్షం కురిపించి వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ‘‘ ఈ నలుగురు మొత్తం ఉగ్రమాడ్యూల్‌లో అత్యంత కీలకమైన సభ్యులు. వీళ్ల వద్ద చాలా సమాచారం ఉంటుంది’’ అని జాతీయ దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. 

ఢిల్లీ పోలీసుల నుంచి నవంబర్‌ 11న అధికారికంగా కేసు తమ చెంతకు వచ్చాక ఎన్‌ఐఏ అమీర్‌ రషీద్‌ అలీ, జసీర్‌ బిలాల్‌ వానీ అలియాస్‌ డ్యానిష్‌లను అరెస్ట్‌చేసింది. గురువారం ఈ నలుగురిని తమ అదుపులోకి తీసుకోవడంతో ఎన్‌ఐఏ అరెస్ట్‌ల సంఖ్య ఆరుకు పెరిగింది. గురువారం ముజామిల్, అదీల్, షాహీనా, ఇర్ఫాన్‌ వగాయ్‌లను ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టుల ప్రాంగణంలోని కోర్టులో ఎన్‌ఐఏ ప్రవేశపెట్టింది. కేసు దర్యాప్తు నిమిత్తం వీళ్లందర్నీ తమకు అప్పగించాలని కోర్టును కోరగా 10 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ప్రధాన జిల్లా, సెషన్స్‌ జడ్జి అంజూ బజాజ్‌ ఛాంద్నా ఉత్తర్వులు జారీచేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)