Breaking News

ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి ఆత్మహత్య 

Published on Fri, 10/22/2021 - 15:50

సాక్షి, శామీర్‌పేట్‌: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుమ్మ జ్యోతి(34) తన కుటుంబ సభ్యులతో కలిసి మండలకేంద్రమైన శామీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని తన అక్కచెల్లెళ్లతో చెప్పింది.

ఇటీవల జ్యోతిని ప్రేమించిన వ్యక్తి పెళ్లి విషయం రాగానే మాట దాటవేస్తున్నాడని బాధపడుతోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లి వేదవతి ఇంటికి వచ్చే సరికి ఉరివేసుకున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు. 
చదవండి: వివాహేతర సంబంధం: మైనర్‌ బాలుడే నిందితుడు

వివాహేతర సంబంధం.. యువకుడిపై హత్యాయత్నం 
ఘట్‌కేసర్‌: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిపై గురువారం హత్యాయత్నం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... అంబేడ్కర్‌నగర్‌ జవహర్‌నగర్‌కు చెందిన ఎడ్ల దేవ(30) కూలీ. చక్రిపురం కుషాయిగూడకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీని గురించి తెలుసుకున్న వివాహిత సోదరుడు నవీన్‌ అతడిని చంపాలని రాంపల్లికి తీసుకొచ్చి మద్యం సేవించారు.
చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ

అనంతరం ఘట్‌కేసర్‌–ఘనాపూర్‌ సర్వీస్‌ రోడ్డు చెట్లపొదల్లో మరొక వ్యక్తితో కలిసి కత్తితో గొంతు కోశారు. వెంటనే దేవ వారి నుంచి తప్పించుకొని రోడ్డుపైకి పరుగెత్తగా ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్సత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)