Breaking News

కొంపముంచిన డేటింగ్‌ యాప్‌: ‘ఐస్‌’తో కిలాడీ నిలువు దోపిడీ

Published on Sat, 10/14/2023 - 13:45

డేటింగ్‌ యాప్‌ పరిచయం  ఓ యువకుడి కొంప ముంచింది.  బంబుల్‌యాప్‌లో పరిచయమైన  గురుగ్రామ్‌కు చెందిన  యువకుడికి  మత్తుమందు ఇచ్చి మరీ  మహిళ నిలువునా దోచేసింది. బంగారం, నగదు, లగ్జరీ ఐఫోన్‌తో పాటు,  బ్యాంకు ఖాతాని ఖాళీ చేసేసింది.  విషయం తెలుసుకున్న బాధితుడు  లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది.  హర్యానాలోని గురుగ్రామ్‌లో  ఈ ఉదంతం చోటు చేసుకుంది. 

గురుగ్రామ్ వ్యక్తికి బంబుల్ డేటింగ్ యాప్‌లో సాక్షి అలియాస్ పాయల్ అనే ఆ మహిళతో పరిచయం ఏర్పడిందని బాధితుడు రోహిత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ప్రకారం తాను ఢిల్లీకి చెందిన దాన్ననీ, అయితే గురుగ్రామ్‌లో తన అత్తతో నివసిస్తున్నాననిపాయల్‌ చెప్పింది. గత వారం పాయిల్‌కు ఫోన్ చేసి, కలుద్దామని  రోహిత్‌ను  కన్విన్స్‌ చేసింది. అనుకున్న ప్రకారం రోహిత్‌ వాళ్ల ఇంట్లో  కలుసుకున్నారు. ఆ తరువాత దగ్గర్లోని దుకాణంలో మద్యం కొనుక్కుని ఇంటికి చేరుకున్నారు.  ఆ తరువాత  ఐస్ తీసుకురమ్మనే నెపంతో  అతడి దృష్టి మళ్లించింది. అతడలా ఐస్‌ కోసం  వెళ్లగానే  డ్రింక్‌లో  ఏ మత్తుమందు  తెలిపిందో తెలియదు గానీ అది తాగిన వెంటనే రోహిత్‌ స్పృహ కోల్పోయాడు.  

ఆ మత్తు ఎంత ప్రభావితం చేసిందంటే...అక్టోబర్ ఒకటోతేదీ  రాత్రి స్పృహ కోల్పోతే..అక్టోబర్ 3వ తేదీ ఉదయం నిద్రలేచేంత.కళ్లు తెరిచి చూసే సరికి ఆమె ఇంట్లో లేదు.  బంగారు గొలుసు,  ఖరీదైన ఐఫోన్ 14 ప్రో, రూ. 10వేల నగదు, క్రెడిట్,డెబిట్ కార్డులు మాయం. ఇంతలో తన  బ్యాంకు అకౌంట్‌నుంచి రూ. 1.78 లక్షలు విత్‌డ్రా  అయినట్లు కూడా  గుర్తించాడు.  దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)