కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ..
Published on Fri, 07/15/2022 - 09:05
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): జీవితం ఇబ్బందుల్లో పడిందని ఆవేదన చెందిన మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంగొండనహళ్లి నివాసి, ఐటీ ఉద్యోగి అయిన అనిత (25) మృతురాలు. ఈమె తాను పనిచేస్తున్న కంపెనీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రదీప్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.
చదవండి: మూడు పెళ్లిళ్లు.. సవతుల మధ్య పోరు.. చివరికి షాకింగ్ ట్విస్ట్
భర్త వేధింపులు, కోర్టు కేసు
అయితే ఆరునెలలకే ప్రదీప్ తన నిజస్వరూపం బయటపెట్టాడు. కట్నం కావాలని వేధించడం ప్రారంభించాడు. దీంతో అతనితో జీవితం కొనసాగించడం ఇష్టం లేక విడాకుల కోసం కోర్టులో కేసు వేసింది. గురువారం కోర్టు తీర్పు ఇవ్వనుండగా, జీవితంలో తప్పటడుగులు వేశానని విరక్తి చెంది బుధవారం రాత్రి అనిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రదీప్, అతడి తల్లి ఇద్దరూ పరారయ్యారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Tags : 1