Breaking News

అంబులెన్స్‌లో దారుణం.. పేషెంట్‌ భార్యనే వేధించి..

Published on Thu, 09/05/2024 - 14:02

అంబులెన్స్‌ డ్రైవర్‌, హెల్పర్‌ దారుణానికి పాల్పడ్డారు. బ్రెయిన్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న భర్తను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ దారుణం నుంచి బాధితురాలు ప్రతి ఘటించడంతో నిందితులు ఆమె భర్తకు ధరించిన ఆక్సిజన్‌ మాస్క్‌ తొలగించారు. అందిన కాడికి డబ్బుల్ని దోచుకుని పరారయ్యారు.  

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌ సిద్ధార్థ్ నగర్ జిల్లాలో బ్రెయిన్‌ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తను అతని భార్య చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆస్పత్రి ఖర్చులు భరించలేక మరుసటి రోజే అంబులెన్స్‌లో భర్తను ఇంటికి తరలించేందుకు ప్రయత్నించింది. 

ఇందుకోసం ఓ అంబులెన్స్‌ను మాట్లాడుకుని ఇంటికి బయలు దేరారు బాధితురాలు, ఆమె తమ్ముడు. అర్ధరాత్రి కావడంతో మార్గం మధ్యలో అంబులెన్స్‌ డ్రైవర్‌, హెల్పర్‌ బాధిత మహిళపై దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించారు. ముందు క్యాబిన్‌లో కూర్చోమని, ఆపై వేధించారు. వేధింపులకు పాల్పడడం గుర్తించిన బాధితురాలి తమ్ముడు అడ్డుకోగా.. చివరగా ఛవానీ పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారిపై అంబులెన్స్‌ను ఆపారు. భర్తకు తగలించిన ఆక్సిజన్‌ మాస్క్‌ను తొలగించారు. బాధితుణ్ని బలవంతంగా కిందకు దించారు. అనంతరం డబ్బు, నగదుతో అక్కడి పరారయ్యారు.

ఆక్సిజన్‌ మాస్క్‌ తొలగించడంతో అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏడీసీపీ జితేంద్ర దుబే తెలిపారు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)