Breaking News

పెళ్లికి ముందే ప్రేమ.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది

Published on Wed, 02/22/2023 - 08:27

సాక్షి, చెన్నై:  ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో ఇల్లాలు. భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు కట్టుకథ అల్లినా మామ ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా ఆర్కే పేట మండలం చంద్రవిలాసపురం సమీపంలోని సుందర్రాజుపురానికి చెందిన ఆరుముగం కుమారుడు యువరాజ్‌ (29) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నా డు. అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురు గాయత్రి(25)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో యువరాజ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు గాయత్రి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అయితే మృతిపై అనుమానంతో యువరా జ్‌ తండ్రి ఆరుముగం ఆర్కేపేట పోలీసులకు ఫిర్యా దు చేశారు. సీఐ అన్నాదురై విచారణ చేపట్టారు. గాయత్రి పొంతనలేని సమాధానం చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజం వెలుగు చూసింది.   

అడ్డు తొలగించుకునేందుకే.. 
గాయత్రి చెన్నైలోని ప్రైవేటు కళాశాలలో డిప్లమా నర్సింగ్‌ చదువుతుండగా అదే కళాశాలలో పనిచేస్తున్న తిరుత్తణి ఆగూరుకు చెందిన శ్రీనివాసన్‌ (28)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే కళాశాల చదువు పూర్తికావడంతో గాయత్రికి యువరాజ్‌తో వివాహం చేశారు. అయితే  ఏడాది కిందట తిరుత్తణిలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా చేరిన గాయత్రికి అక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసన్‌ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

భార్య  ప్రవర్తనపై అనుమానం రావడంతో ఉద్యోగానికి సైతం నిలిపివేశారు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న యువరాజ్‌ను గాయత్రి, ఆమె ప్రియుడు శ్రీనివాసన్, అతని స్నేహితులు మణిగండన్‌(26), హేమంత్‌ అలియాస్‌ జిల్లు(23) గొంతు నులుమి హత్య చేసినట్లు విచారణలో తేలింది. పరారీలో ఉన్న నిందితులను డీఎస్పీ విఘ్నేష్‌ ఆధ్వర్యంలో బృందం అదుపులోకి తీసుకుంది. వారిని రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)