Breaking News

భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు

Published on Sat, 04/29/2023 - 10:00

సాక్షి, విజయవాడ స్పోర్ట్స్‌: తన జల్సాలకు అడ్డుపడుతున్న భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి డి.లక్ష్మీ శుక్రవారం తీర్పు చెప్పారు. 2016 నవంబర్‌ 23న కొత్తపేట (టూ టౌన్‌) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన అప్పట్లో నగర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరానికి చెందిన జమలమ్మకు జి.కొండూరు మండలం వెంకటాపురానికి చెందిన ఏడుకొండలు(32)కు 16 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లకు జమలమ్మ చెడు వ్యసనాలకు బానిసైంది.

వీటిపై ప్రశ్నిస్తున్న భర్త ఏడుకొండలును అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయాన్ని తన చెల్లెలు లక్ష్మికి వివరించింది. అదే గ్రామంలో హత్య చేస్తే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో కాపురాన్ని టుటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పి.నైనవరం గ్రామానికి మార్చింది. అంబాపురంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించిన రోజునే చెల్లెలు లక్ష్మి, న్యూఆర్‌ఆర్‌ పేటకు చెందిన ఒడియార్‌ గణేష్, జక్కంపూడికి చెందిన బాలసాని తిరుపతి సాయంతో జమలమ్మ తన భర్త ఏడుకొండలు మెడకు తాడు చుట్టి చంపేసిందని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

మూడు రోజుల తర్వాత ఆ గది నుంచి వస్తున్న దుర్వాసను పసిగట్టిన ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జమలమ్మకు కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. మిగిలిన నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు.

(చదవండి: పేపరు మీద లెక్కలు.. చూస్తే బోగస్‌ సంస్థలు!)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి