Breaking News

యూనివర్సిటీ వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. పరారీలో భర్త, అత్త? ..?

Published on Tue, 05/07/2024 - 11:05

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఘోరం వెలుగుచూసింది. గౌతమ్‌ బుద్దా యూనివర్సిటీలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్‌ ట్యాంక్‌లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

 మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను భర్త, అత్తే హత్య చేసి అక్కడి నుంచి పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  మహిళ భర్త సమీపంలోని జిమ్స్‌ ఆసపత్రిలో పనిచేస్తున్నట్లు తేలింది. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు. 

ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త, అత్త కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు. కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వాస్తవాలను బయటపెడతామని చెప్పారు.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)