Breaking News

కీచక భర్త హత్య .. ఆపై ముక్కలు

Published on Fri, 01/03/2025 - 06:11

దొడ్డబళ్లాపురం: భార్యను పరుల పడకలోకి వెళ్లా­లని వేధించడమే కాక..  కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక భర్తను భార్యే హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి మాయం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా చిక్కోడి తాలూ­కా ఉమరాణి గ్రామ నివాసి శ్రీమంత ఇట్నాళ (35), భార్య సావిత్రి కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. డబ్బుల కో­సం సావిత్రిని పరాయి పురుషులతో పడుకోవా­లని శ్రీమంత బలవంతం చేసేవాడు. దీంతో ఆమె భర్త దూరం పెట్టసాగింది.

తనను నిత్యం అదే తరహాలో వేధించడమే కాకుండా.. ఇ­టీవల కన్న కూతురి­పైనే శ్రీ­మంత అత్యా­చారయ­­త్నానికి ఒడిగట్టా­డు. దీంతో తీవ్ర ఆ­గ్ర­హానికి గురైన సా­వి­త్రి బండరాయితో బాది భర్తను హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చిన్న డ్రమ్ములో వేసి ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసింది. భర్త దుస్తులను కాల్చివేసింది. హత్యకు ఉపయోగించిన బండరాయిని కడిగి షెడ్‌లో దాచిపెట్టింది. కాగా గురువారం శ్రీమంత మృతదేహం ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయటపడింది. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సావిత్రి ఒప్పుకుంది. 

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)