పశ్చాత్తాపం లేని ‘విషపు దామిని’?

Published on Mon, 07/20/2026 - 09:15

మీరట్‌: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకున్న స్నేక్ మర్డర్ కేసులో భర్తను పాముతో  కాటు వేయించి, హత్య చేసిన కేసులో నిందితురాలు దామినిని పోలీసులు విచారిస్తున్నారు. ‘నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపం లేదా?’ అని పోలీసులు అని ప్రశ్నించగా, ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించింది. అయితే, తాను అతుల్‌తో కలిసి ఉండలేనని, తన జీవితం నరకప్రాయంగా మారిందని విచారణలో తెలిపింది. అతుల్, దామినిలకు 2019లో ప్రేమ వివాహం జరిగింది. ఆ తర్వాత పాఠశాల డ్రైవర్ తుషార్‌తో దామినికి సాన్నిహిత్యం పెరిగింది.

సుమారు 20 లక్షల రూపాయల బీమా సొమ్ము, వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. అతుల్‌ను అడ్డు తొలగించుకునేందుకు తొలుత కారుతో ఢీకొట్టి హత్య చేయాలని ప్రయత్నించగా, హెల్మెట్ ధరించడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో పథకం మార్చిన నిందితులు ఇంటర్నెట్‌లో అత్యంత విషపూరితమైన పాము గురించి వెతికి, రూ. 15,000 అడ్వాన్స్ ఇచ్చి, పాములు పట్టేవారి సాయంతో పామును తెప్పించి, అతుల్‌ హత్యకు కుట్ర పన్నారు. ప్రస్తుతం పోలీసులు కాల్ డేటా, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రాకెట్ సక్సెస్ కాల్‌లో బయటపడ్డ మోదీ ఫోన్ సీక్రెట్ ట్యూన్!

#

Tags : 1

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)