Breaking News

అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సీఐపై భార్య ఫిర్యాదు

Published on Sat, 02/08/2025 - 17:23

శాలిగౌరారం: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతోపాటూ మరో మహిళను రెండో వివాహం చేసుకుని తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ఆబిడ్స్‌ సీఐ నర్సింహపై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. న‌ల్ల‌గొండ జిల్లా శాలిగౌరారం మండలం బండమీదిగూడెంకు చెందిన కప్పల సోమలింగయ్య–అంజమ్మ కుమార్తె సంధ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన కుంభం నర్సింహకు 2012 లో వివాహం జరిగింది. నర్సింహ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

వివాహ సమయంలో కట్నకానుకలు మొత్తం అప్పజెప్పారు. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడని సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. తట్టుకోలేక 2024  జూన్‌లో తల్లిగారింటికి వచ్చి తన భర్తపై 2024 డిసెంబర్‌18న నల్లగొండ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానంది. అక్కడ చర్యలు తీసుకోకపోవడంతో 2024 డిసెంబర్‌ 24న శాలిగౌరారంలో ఫిర్యాదు చేశానంది.

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో గల తన కుమార్తెను చూసేందుకని ఈ నెల 4న పాఠశాలకు వెళ్లి తన కూతురిని తల్లిగారింటికి తీసుకుని వచ్చానని తెలిపింది. దీంతో తన కుమార్తె కిడ్నాప్‌నకు గురైందని నర్సింహ సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సరూర్‌నగర్‌ ఎస్‌ఐ మారయ్య, ఏఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి, మహిళా హెడ్‌కానిస్టేబుళ్లు శుక్రవారం బండమీదిగూడెం వచ్చి తనను విచారించి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారని సంధ్య తెలిపింది.

చ‌ద‌వండి: డబ్బులు ఇచ్చి.. భర్త కాళ్లు విరగ్గొట్టించిన భార్య 

ఈ విషయమై ఆబిడ్స్‌ సీఐ నర్సింహ వివరణ కోరగా, తన భార్యతో గొడవలు జరుగుతున్నాయిని దీంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించానని తెలిపారు. ప్రస్తుతం తమ కేసు కోర్టులో ఉందన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)