Breaking News

Vizag Beach: వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్‌

Published on Thu, 04/27/2023 - 17:42

సాక్షి, విశాఖపట్నం:  వివాహిత శ్వేత అనుమానాస్పద మృతి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ  ఘటనలో పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. భర్త మణికంఠ చెల్లెలి భర్తపైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదుతో త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  

శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. విశాఖలోని జ్ఞానాపురం స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టుతోపాటు శ్వేత సెల్‌ఫోన్‌ కీలకంగా మారింది. మృతురాలి మొబైల్‌ను పరిశీలిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా అత్తింటి వేధింపులతో విశాఖ బీచ్‌లో ఐదు నెలల గర్భిణి శ్వేత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
చదవండి: విశాఖ బీచ్‌లో గర్భిణీ మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు.. సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

అసలేం జరిగిందంటే..
పెదగంట్యాడ మండలం నడుపూరులో గురువెల్లి మణికంఠ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దొండపర్తికి చెందిన శ్వేత(24)తో గత ఏడాది మణికంఠకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల కిందట అతను హైదారాబాద్‌ వెళ్లాడు. శ్వేతను ఇక్కడే అతని తల్లిదండ్రుల వద్ద ఉంచాడు.

మంగళవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తామామలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో ఆమె మామ శాంతారావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆర్‌.కె.బీచ్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులు సమాచారం ఇచ్చారు.

వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్వేత ఫొటోతో సరిపోల్చి.. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చిట్టీ(మణికంఠ ముద్దు పేరు) నేను లేకపోయినా నువ్వు బిందాస్‌గా జీవిస్తావని నాకు తెలుసు. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ ఫర్‌ యువర్‌ ఫ్యూచర్‌. బిగ్‌ థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీ థింగ్‌ అని రాసి ఉంది.
చదవండి: సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి..

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)