Breaking News

రెచ్చిపోయిన గ్రామస్తులు.. పోలీసులపై దాడి.. ఏఎస్‌ఐ మృతి

Published on Fri, 03/14/2025 - 15:22

పాట్నా: ఓ ఊరి గ్రామస్తులు దారుణానికి ఒడిగట్టారు. ఊర్లో పెళ్లి చేసుకుంటున్న క్రిమినల్‌ను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడుల చేశారు. గ్రామస్తులు చేసిన దాడుల్లో ఏఎస్‌ఐ దుర్మరణం పాలయ్యారు.

బీహార్‌ రాష్ట్రం, అరారియా జిల్లా ఫుల్కహా అనే గ్రామంలో అన్మోల్‌ యాదవ్‌ ఓ పేరు మోసిన క్రిమినల్‌. పలు నేరాలకు పాల్పడి.. పోలీసులు కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ఈ క్రమంలో బుధవారం అన్మోల్‌ యాదవ్‌ తన స్వగ్రామంలో పెళ్లి చేసుకుంటున్నాడనే సమాచారం పోలీసులకు అందింది.

వెంటనే ఫుల్కహా గ్రామంలో పోలీసులు మోహరించారు. పెళ్లి చేసుకుంటున్న క్రిమినల్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో గ్రామస్తులు రెచ్చిపోయారు. పోలీసులపై దాడులకు తెగబడ్డారు. దాడుల్లో ఏఎస్‌ఐ రాజీవ్‌ రంజన్‌ మాల్‌  దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయాడు. అప్రమత్తమైన పోలీసులు రాజీవ్‌ రంజన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వైద్య పరీక్షల్లో ఏఎస్‌ఐ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఎస్పీ అంజన్‌ కుమార్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఆరుగురు ఆనుమోల్‌ యాదవ్‌ మద్దతుదారుల్ని అరెస్ట్‌ చేశారు. అనుమోల్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)