Breaking News

బోయినపల్లి రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన వైష్ణవి మృతి

Published on Thu, 08/03/2023 - 13:54

సాక్షి, హైదరాబాద్‌: బోయినపల్లి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వైష్ణవి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. నాన్న ఎలా ఉన్నాడంటూ అడిగిన మాటలే వైష్ణవి చివరి మాటలయ్యాయి. కాగా బుధవారం తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి  వైష్ణవి రోడ్డుపై పడిపోవడంతో డీసీఎం ఢీకొట్టిన విషయం తెలిసిందే.

వివరాలు.. ఆర్మీ విశ్రాంత ఉద్యోగి విజయ్‌ కుమార్‌ బుధవారం తన కుమార్తె వైష్ణవితో కలిసి స్కూటీపై కానాజీ గూడ నుంచి బోయిన్‌పల్లికి బయలుదేరారు.  మార్గమధ్యలో ప్రియదర్శిని హోటల్‌ వద్ద స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయారు. ఇంతలోనే ఆ మార్గంలో వేగంగా వస్తున్న డీసీఎం వాహనం వైష్ణవి మీదుగా వెళ్లిపోయింది. ఎమ్‌ఎన్‌ఆర్‌ కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్న వైష్ణవిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

దీంతో తీవ్ర గాయాల పాలైన వైష్ణవిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం వైష్ణవి ప్రాణాలు విడిచింది. మరోవైపు వైష్ణవి నివాసముండే ఖానాజీగూడాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)