సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం.. అసలు విషయం తెలిసి అవాక్కయిన పోలీసులు!

Published on Wed, 07/12/2023 - 15:42

వాషింగ్టన్‌: సాధారణంగా దొంగతనం చేసేటప్పుడు దొంగలు క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల నుంచి సొమ్ము, బంగారం వంటివి దోచుకోగానే అక్కడి నుంచి జాడలేకుండా పారిపోతారు. ముఖంపై మాస్క్‌ ధరించి వాళ్లెవరో తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇంత వరకు మనకు తెలిసిన కథే.. అయితే ఓ దొంగ మాత్రం వీటన్నింటికి భిన్నంగా ప్రవర్తించాడు. సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం చేశాడు. ఈ వింత ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌ నగరంలోని మాన్‌హట్టన్‌లో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన దొంగ తుపాకీ గురిపెట్టి డబ్బులు డిమాండ్‌ చేశాడు. దాంతో ఆ యువకుడు తన దగ్గర డబ్బులు లేవని, కేవలం సెల్‌ఫోన్‌, ఏటీఎం కార్డు మాత్రమే ఉందని చెప్పాడు. అయితే ఏటీఎంకు పదా అంటూ బాధితుడిని దొంగ తన కారులో తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేయించి తీసుకున్నాడు. చోరీ అనంతరం దొంగ ఏం చేయకుండా యువకుడిని సురక్షితంగా ముందు ఉన్న ప్రదేశంలోనే దింపాడు. అంతేకాకుండా ఆ దొంగ కొన్ని విషయాలు బయటపెట్టాడు. యువకుడి వద్ద డబ్బులు దోచుకున్నందుకు ‘సారీ బ్రదర్‌.. నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లే దొంగలిస్తున్నట్లు’ వివరించాడు.  మొబైల్ ఫోన్ కూడా త్వరలోనే తిరిగి ఇస్తానని ఆ యువకుడికి చెప్పాడు.

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను దొంగకు ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ కలుద్దాం అని చెప్పి ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.ఈ విషయం తెలియగానే పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ ఘటన అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

చదవండి: Largest Restaurant In World: కొండల మధ్యలో రెస్టారెంట్‌.. ఒకేసారి 5800మంది భోజనం చేయొచ్చు

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)