Breaking News

హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు

Published on Wed, 09/13/2023 - 11:22

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మంగళవారం ఒక్క రోజే రెండు హత్యలు వెలుగు చూశాయి.  పటాన్‌చెరు పరిధిలోని ఇస్నాపూర్‌ శివారులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన నదీమ్ అహ్మద్(27)గా గుర్తించారు.

టోలిచౌకిలో నివసిస్తున్న నదీమ్‌.. సంగారెడ్డిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇస్నాపూర్‌ వద్ద గొడవ జరగడంతో  గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో గొంతు కొసి చంపినట్లు తేలింది. .మృతుడి తండ్రి అబ్దుల్‌ ఖయ్యూం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నజీర్‌ అహ్మద్‌గా గుర్తించారు. రెండు సంవత్సరాల క్రితం జహీరాబాద్‌లో జరిగిన విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహమ్మద్ నిందితుడిగా ఉన్నాడు.  విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ సహా ఏడుగురు నిందితులుగా ఉన్నారు.  ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)