Breaking News

‘నేను భర్తగా భావించే సాయే నా అంత్యక్రియలు చేయాలి’

Published on Thu, 07/16/2026 - 17:54

 సాక్షి, ప్రకాశం: సోషల్‌ మీడియా పరిచయం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తాను భర్తగా భావించిన వ్యక్తికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపినేని సాయి సుమంత్‌, కీర్తి అనే ఇద్దరికీ సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. సుమంత్‌ దుబాయ్‌లోని ఒక ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తుండగా, కీర్తి ముంబైలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు.

అయితే, కీర్తికి తెలియకుండా సుమంత్‌ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయమై కీర్తి అతడిని నిలదీయగా.. సుమంత్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన కీర్తి ఆత్మహత్య చేసుకుంది. తనువు చాలించే ముందు ఆమె ఒక లేఖ రాసింది. తాను భర్తగా భావించే సాయి సుమంత్ చేతుల మీదుగానే తన అంత్యక్రియలు నిర్వహించాలన్నదే తన ఆఖరి కోరికని ఆ లేఖలో పేర్కొంది.

కీర్తి మరణానంతరం ఆమె మృతదేహాన్ని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులోని సాయి నివాసానికి తీసుకువచ్చారు. చనిపోయిన కీర్తి మెడలో సాయి తాళి కట్టాలని, ఆమె అంత్యక్రియలను అతడే జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు అక్కడ ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో సాయి సుమంత్‌ తల్లిదండ్రులు కీర్తి కుటుంబ సభ్యులను బెదిరించి, ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)