Breaking News

ఊహించని మృత్యువు అంటే ఇదేనేమో!

Published on Mon, 09/11/2023 - 09:20

సాక్షి, చెన్నై: బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై ఈ వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ మినీ వ్యాన్‌ను గూడ్స్‌ లారీ ఢీ కొట్టిన ఘటనలో ఏడుగురు బలయ్యారు. మృతులంతా మహిళలే కాగా.. అనూహ్యా రీతిలో వాళ్లు దుర్మరణం పాలవడం గమనార్హం. 

వెల్లూరు జిల్లా పెర్నాంబట్‌ టౌన్‌ ఓనన్ గుట్టాయ్ ప్రాంతానికి చెందిన 15 మందికి పైగా బృందం మినీ వ్యాన్‌లో మైసూరు పర్యటనకు వెళ్లారు.  గత రాత్రి యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నాట్రంపల్లి సమీపంలోని నడ్రంపల్లి గ్రామం వద్ద వారి వ్యాన్ చెడిపోయింది. ఆ తర్వాత, వ్యాన్‌లోని వాళ్లంతా హైవేలో ఉన్న కాంక్రీట్‌ దిమ్మెలపై కూర్చున్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న గూడ్స్‌ లారీ ఒకటి.. బ్రేక్‌డౌన్‌లో ఉన్న వ్యాన్‌ను ఢీకొట్టింది.

ఆ వ్యాన్‌ బోల్తా పడడంతో అక్కడ కూర్చున్న మహిళలు నుజ్జునుజ్జు అయ్యారు. అలాగే 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి వాహనదారులు అది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రంగా గాయపడిన 8 మందిని చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?