Breaking News

అమ్మా, నాన్న క్షమించండి.. ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా!

Published on Sun, 04/20/2025 - 18:18

నేటి కాలంలో భార్యా భర్తల సంబంధాల్లో ఆస్తులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జీవితాంతం కలిసుండాలని ప్రమాణం చేసిన బంధాల్ని చిదిమేస్తున్నాయి. పెళ్లి సంబంధాలు వేట మొదలుపెట్టిన దగ్గర్నుంచీ అబ్బాయికి ఎంత ఉంది(ఆస్తి).. అమ్మాయి ఎంత స్త్రీ ధనం(కట్నం) తెచ్చుకుంటుందనే తతంగం మరీ ఎక్కువైపోయింది. అసలుకంటే కొసరు ముద్దు అనే చందంగా తయారైంది. అది చివరకు వైవాహిక బంధాలు నాశనం కావడానికి కూడా కారణమవుతోంది. 

తాజాగా జరిగిన ఘటనలో తన పేరున ఇల్లు రాసివ్వాలని భార్య పట్టుబట్టడంతో పాటు బంధువుల్ని తీసుకొచ్చి  నానా రకాల హింస పెట్టడంతో ప్రాణాలు తీసుకున్నాడు భర్త.  భార్య నుంచి వేధింపుల్ని తట్టుకోలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎటావాలో 33 ఏళ్ల  ఫీల్డ్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  తన భార్య నుంచి ఎలా వేధింపులకు గురయ్యాడో వీడియో రికార్డ్ చేసి మరీ తనువు చాలించాడు. మోహిత్ యాదయ్‌కు ప్రియా అనే అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది.  ఏడేళ్ల పాటు రిలేషనలో ఉన్న వీరు 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్నుంచీ అమ్మాయి తల్లి.. వీరి కాపురాన్ని శాసిస్తూ వస్తోంది. చివరకు భార్య ప్రియ గర్బవతి అయినా కూడా అబార్షన్ చేయించిందట అత్త. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తన అత్త తీసుకెళ్లిపోయిందని మోహిత్ రికార్డు చేసిన వీడియో ద్వారా తెలిసింది.

చనిపోయి ముందే మోహిత్ చెప్పిన మాటలు..
‘ఇల్లు తన పేరున రిజిస్టర్ చేయాలని నా భార్య తరచు వేధింపులకు గురిచేస్తోంది. ఇల్లు, ఆస్తి అంతా తన పేరునే రాయాలట. మా అమ్మా‍, నాన్నలపై కూడా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆమె  తండ్రి చేత ఒక తప్పుడు కేసు పెట్టించింది. నా భార్య సోదరుడు నా బావమరిది నన్ను చంపుతానని పదే పదే బెదిరిస్తున్నాడు. రోజూ ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంది నా భార్య, ఆమె తల్లి దండ్రులకు దీనికి సపోర్ట్ చేస్తున్నారు’ అని పేర్కొన్నాడు.

అమ్మా నాన్న క్షమించండి.. నేను ఈ ప్రపంచం నుంచి వెళ్లి పోతున్నా. నాకు న్యాయం జరిగాలి. నా చావుతోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే నా బూడిదను డ్రైన్ లో కలిపేయండి’ అని వీడియోలో కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రాణాలు తీసుకున్నాడు.

ఇదీ చదవండి: 

నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)