Breaking News

పెనుమూరులో టీడీపీ కార్యకర్తల బరితెగింపు

Published on Tue, 06/18/2024 - 05:32

కార్వేటినగరం: చిత్తూరు జిల్లా పెనుమూరు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ కామసాని విజయ­కుమార్‌రెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఇంటి ఆవరణలోని రెండు కార్లను ధ్వంసం చేశారు. విజయకుమార్‌రెడ్డిని చంపుతామని బెదిరించారు. విజయకుమార్‌రెడ్డి పెనుమూరు హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రపోతుండగా పెనుమూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పి.సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు పి.అనంత్‌రెడ్డి, పి.హేమాద్రినాయుడు కుమారుడు పి.ప్రదీప్, కె.బాబు కుమారుడు కె.రాజేష్‌ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి ఆ ఇంటిపై దాడిచేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కారు అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు.

వైఎస్సార్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలున్న కారు నంబరు ప్లేట్లను పెరికి ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న పెనుమూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బండి కమలాకరరెడ్డి కారు నంబర్‌ ప్లేటు తీసి పగులగొట్టారు. అనంతరం ఇంట్లో నిద్రపోతున్న విజయకుమార్‌రెడ్డికి ఫోన్‌చేసి బయటకు రమ్మని పిలిచారు. నిద్రలో ఉన్న విజయకుమార్‌రెడ్డి భార్యాపిల్లలతో బయటకు రాగా చంపుతామంటూ బెదిరించారు. భయంతో విజయకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకు­­న్నారు. వీరి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన సోమవారం ఉదయం పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుమూరు ఎస్‌ఐ లోకేష్‌ సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు.

నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలి 
అర్ధరాత్రి ఇంటి పైకి వచ్చి కార్లు ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు తక్షణమే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వారు సోమవారం విజయకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన  నారాయణస్వామి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)