Breaking News

దర్శిలో అర్ధరాత్రి టీడీపీ రౌడీల వీరంగం

Published on Tue, 06/18/2024 - 05:39

దర్శి: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రకాశం జిల్లా దర్శిలో ప్రజలు భయంతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చి పడతారోనని ప్రజలు ఆందోళనతో బతుకుతున్నారు. ఆదివారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. 30మందికి పైగా నరసరావుపేట నుంచి తెచ్చిన రౌడీలతో కలిసి వైఎస్సార్‌సీపీ నాయకుడు కుందురు నరసింహారెడ్డి ఇంటి విధ్వంసం సృష్టించారు. బాధితుడు నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.40 సమయంలో కాలింగ్‌ బెల్‌ మోగడంతో ఇంటి తలుపు తీశారు.

ఇంటి బయట ఉన్న రౌడీలు నరసింహారెడ్డి నువ్వేనా అంటూ ప్రశ్నించి దర్శిలో మేం ఓడిపోవడానికి కారణం నువ్వేనంటూ దుర్భాషలాడారు. ఈవీఎంలు ఎత్తుకెళుతుంటే అడ్డుకుంటావా అని బూతులు తిట్టారు. కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఇంటి దిమ్మెలను బాది పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ గేటుకు ఉన్న లైట్లు పగులగొట్టి వీరంగం వేశారు. నరసింహారెడ్డి వరండా గేటు తీయకుండా పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. బయట రౌడీలు దాడి చేయడంతో ఇంట్లో ఉన్న నరసింహారెడ్డి భార్య, పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.

నీతో పాటు మరో 30 మంది మా టార్గెట్‌లో ఉన్నారని, మీ అందరి అంతు చూస్తామంటూ నరసింహారెడ్డిని బెదిరించారు. ఈ లోగా పోలీస్‌ వాహనం రావడం, చుట్టుపక్కల వారు అక్కడకు రావడంతో వారంతా పారిపోయారు. ఈ ఘటనతో నియోజకవర్గం ఉలిక్కిపడింది. దర్శిలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి వచ్చి కొత్తగా రౌడీ సంస్కృతిని తెచ్చిందని మండిపడుతున్నారు. 

పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
టీడీపీ శ్రేణుల దాడిపై నరసింహారెడ్డి భార్య కుందురు సునీత స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎన్నికల్లో తన భర్త నరసింహారెడ్డి బూత్‌ ఏజెంట్‌గా ఉన్న బూత్‌లో ఈవీఎంలు ఎత్తుకెళ్లనీయలేదని, అందుకే తమపై కక్ష కట్టి ఇంటిపైకి వచ్చి దాడి చేసి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.

బూచేపల్లి పరామర్శ..
టీడీపీ నాయకుల దాడి విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ సోమవారం నరసింహారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఆపద రాకుండా అండగా ఉంటానని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)