Breaking News

బెదిరించి, కవ్వించి.. వైఎస్సార్‌సీపీ కుటుంబంపై టీడీపీ దాడి

Published on Sat, 04/20/2024 - 05:13

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  టీడీపీలో చేరతారా లేక కుల, గ్రామ బహిష్కరణ చేయమంటారా అని బెదిరించినా, భయపెట్టినా లొంగలేదని ఒక కుటుంబంపై టీడీపీ వర్గీయులు దాడిచేసి ఐదుగురిని గాయపరిచారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెం ఎస్సీ కాలనీలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు ఈ దారుణానికి దిగారు. బాధితుల కథనం ప్రకారం వైజాగ్‌లో ఉద్యోగం చేసుకునే ఈ కాలనీ వాసి గడ్డం కిషోర్‌ ఇటీవల ఇంటికి వచ్చాడు. వీరి కుటుంబాన్ని టీడీపీలో చేరాలని అదే కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు ఐనంపూడి రమేష్‌ 2019 నుంచి డిమాండ్‌ చేస్తున్నాడు.

ఆయన భయపెట్టినా, బెదిరించినా కిషోర్‌ కుటుంబం వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో కిషోర్‌ తన ఇంటి గేటు వద్ద ఉండగా ఆ కాలనీకి చెందిన గడ్డం మధు అనే యువకుడు సిమెంటు రాయి తెచ్చి కిషోర్‌ ఇంటి తడికపైకి విసిరాడు. రాయి ఎందుకు విసిరావంటూ కిషోర్‌ కేకలు వేశాడు. తరువాత 11.40 గంటలకు టీడీపీ నాయకుడు ఐనంపూడి రమేష్‌ సుమారు 15 మందిని తీసుకొచ్చి కేకలు వేశాడు. బయటకు వచ్చిన కిషోర్‌ కుటుంబసభ్యులపై దాడిచేశారు.

కిషోర్‌ భార్య హెమీమాను జుట్టు పట్టుకుని లాగటంతోపాటు ఆమె చేతివేలిని గడ్డం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కొరికి గాయపరిచాడు. కిషోర్‌ అక్క దాసరి ఎస్తేరమ్మ, తల్లి గడ్డం కొండమ్మ, బావ నాగరాజుపైన దాడిచేసి గాయపరిచారు. కిషోర్‌ను మురుగు కాలువలో పడేసి పొడవాటి వస్తువుతో కొట్టి గాయపరిచారు. ఆ ప్రాంతంలో వీధిలైట్లను కూడా ఆపేసి ఈ దాడికి దిగారు. ఈ దాడిని చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కిషోర్‌ మేనకోడలు దాసరి ప్రవల్లిక సెల్‌ఫోన్‌ లాక్కుని ధ్వంసం చేశారు. బాధితులకు కొండపి ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు.

ఐనంపూడి రమేష్, గడ్డం వెంకటేశ్వర్లు, లక్కిపోగు సుధాకర్, ఐనంపూడి భాస్కర్, గడ్డం మధు, గడ్డం మరియమ్మ, గడ్డం నిర్మల, గడ్డం ఆకాష్, మరికొందరు తమపై దాడిచేసినట్లు కిషోర్‌ చెప్పారు. ఇరువర్గాలకు గాయాలయ్యాయని, రెండువర్గాలపై కేసులు నమోదు చేస్తామని ఎస్‌.ఐ. కృష్ణబాజిబాబు చెప్పారు. దాడికి గురైనవారి మీద కూడా కేసు పెడతామని ఎస్‌.ఐ. పోలీసులు చెప్పడంతో వైఎస్సార్‌సీపీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాత«ంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)