Breaking News

అమ్మా లే అమ్మా.. ఎందుకిలా చేశావ్‌ అనుప్రియా..

Published on Wed, 05/28/2025 - 10:56

తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్‌క్రీమ్‌ కిందపడిందన్న కారణంతో అత్త మందలించింది. దీంతో, మనస్తాపానికి గురైన కోడలు.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్‌ సమీపంలో జరిగింది.

వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని మెండియమ్మన్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన అశ్విన్‌రాజ్‌ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండున్నరేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ప్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్‌క్రీమ్‌ కిందపడింది. దీంతో అనుప్రియను ఆమె అత్త చిత్ర మందలించింది.

అత్త మందలింపుతో మనస్తాపం చెందిన అనుప్రియ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పుళల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)