Breaking News

టీస్టాల్‌పైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు మృతి

Published on Mon, 07/19/2021 - 08:57

లక్నో : రోడ్డు పక్క టీస్టాల్‌పైకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉ‍త్తరప్రదేశ్‌లోని షహనాజ్‌పూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం షహనాజ్‌పూర్‌లో ఢిల్లీ-లక్నో హైవేపై వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి అక్కడి మెడికల్‌ వద్ద ఉన్న టీస్టాల్‌పైకి దూసుకెళ్లింది. దీంతో టీస్టాల్‌లోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. బస్సులో ఉన్న వారితో కలిపి మొత్తం ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

మృతులను సురేష్‌కుమార్‌, అధార్‌ అలి, వేద్‌ పాల్‌గా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అలి గర్భిణి అయిన తన భార్యను ఆసుపత్రిలో చేర్పించడానికి రాగా..  వేద్‌పాల్‌ అనారోగ్యంతో ఉన్న బంధువును పరామర్శింటానికి వచ్చాడు. ఇ‍ద్దరూ అనుకోని ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)