Breaking News

‘నెమలి కర్రీ’ వీడియోతో బుక్కయ్యాడు

Published on Mon, 08/12/2024 - 04:51

తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘ట్రెడిషినల్‌ పికాక్‌ కర్రీ రెసిపీ’ అంటూ ఓ యూట్యూబర్‌ తన చానల్‌లో వీడియో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్‌ శ్రీటీవీ అనే యూట్యూబ్‌ చానల్‌లో నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్టు చేశాడు. ఈ విషయంపై ‘యూట్యూబ్‌లో నెమలికూర వంటకం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు.

తంగళ్లపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి, ప్రణయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి కల్పనాదేవి మాట్లాడుతూ, వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినందుకు అటవీచట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, పలు అటవీ జంతువులు, పక్షుల వంటకాల వీడియోలు కూడా పోస్టు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఫారెస్టు సెక్షన్‌ అధికారి శ్రవణ్‌కుమార్, బీట్‌ ఆఫీసర్‌ ఎంఏ ఖలీమ్, సిబ్బంది పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)