Breaking News

నా బిడ్డలు నాకు కావాలి.. పీఎస్‌ ఎదుట ఎస్‌ భార్య నిరసన

Published on Wed, 05/22/2024 - 09:23

కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఎస్‌ఐ నాగరాజు భార్య మానస మంగళవారం ఆందోళనకు దిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకొని, ఇద్దరు కుమారులను తీసుకెళ్లాడని, న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఎస్‌ఐ నాగరాజు తనను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని మానస తెలిపింది. రెండేళ్ల నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడని, అనంతరం రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. 

తన ఇద్దరు పిల్లను దూరం చేసి మరో సంసారం చేస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని వాపోయింది. రెండేళ్ల క్రితం కరీంనగర్‌లో పెట్టి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి విడాకులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. దీంతో తాను ఆత్మహత్యకు యత్నించగా.. పిల్లలను తనకు ఇప్పించి న్యాయం చేస్తామని బంధువులు చెప్పడంతో విరమించినట్లు తెలిపింది. ఈ విషయమై సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్‌ మహిళ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

 తన భర్తకు ఫోన్‌ చేస్తే నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టాడని పేర్కొంది. బంధువులతో కలిసి కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌కు రాగా ఎస్‌ఐ ఆరు రోజులుగా సెలవులో ఉన్నాడని చెప్పారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పింది. సీఐ శ్రీనివాస్‌ వివరణ కోరగా.. ఇటీవల మానస ఈ విషయం తన దృష్టికి తీసుకువచి్చందని, కౌన్సెలింగ్‌ ఇచ్చామని, ఉన్నత అధికారుల ఆదేశాసుసారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు