Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి

Published on Mon, 01/29/2024 - 09:37

సాక్షి, నల్గొండ: మిర్యాలగూడ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ ఉన్నారు. నార్కట్‌పల్లి–అద్దంకి హైవేపై మిర్యాలగూడ పట్టణ పరిధిలోని కృష్ణానగర్‌ కాలనీ వద్ద అర్ధరాత్రి 12.10 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.  

తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా.. 
మిర్యాలగూడ మండలం నందిపాడుకు చెందిన చెరుపల్లి చెరుపల్లి మహేష్‌ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. మూడురోజుల క్రితం అతని కుటుంబంతో పాటు బంధువులు కొందరు కలిసి కారులో తీర్థయాత్రలకు వెళ్లారు. యాత్ర ముగించుకుని ఆదివారం రాత్రి గుంటూరు వైపు నుంచి ఇంటికి తిరిగి వస్తూ మరో ఐదు నిమిషాల్లో ఇల్లు చేరతారనగా ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రమత్తులో ఉండి డ్రైవింగ్‌ చేస్తుండగా కారు డివైడర్‌ దాటి రావడంతో అటుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మహేష్‌ (32), అతని భార్య చెరుపల్లి జ్యోతి (30), కుమార్తె రిషిక (6), మహేష్‌ షడ్డకుడు బొమ్మ మహేందర్‌ (38), అతని కుమారుడు లియాన్‌‡్ష (2) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహేందర్‌ భార్య మాధవిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  మహేందర్‌ది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లి అని తెలిసింది. మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.    

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)