Breaking News

ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఉన్మాదం.. నిద్రపోతున్న భార్యను దారుణంగా చంపి.. ఆపై

Published on Sun, 05/21/2023 - 09:41

సాక్షి, హైదరాబాద్‌: అతని వృత్తి ప్రాణాలను పోసే ఆర్‌ఎంపీ డాక్టర్‌. కానీ అందుకు భిన్నంగా భార్యను కత్తితో మెడ కోసి ప్రాణం తీసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి ఏసీపీ జీవీ రమణగౌడ్‌ కథనం ప్రకారం.. శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఓ ఇంట్లో ఆర్‌ఎంపీ డాక్టర్‌ నాగరాజు తన భార్య సుధారాణి, ఇద్దరు కుమారులతో కలిసి ఉంటూ అనుబంధ గ్రామమైన మియాఖాన్‌గూడలో క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రపోతున్న భార్యను కొబ్బరికాయలు కొట్టే కత్తితో మెడ కోసి హత్య చేశాడు. అనంతరం ఏడేళ్ల పెద్ద కుమారుడు దీక్షిత్‌ మొహంపైనా దిండు పెట్టి బలంగా ఒత్తాడు. అంతలోనే అతన్ని వదలి కిచెన్‌లోకి వెళ్లి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తేరుకున్న దీక్షిత్‌ తన తమ్మున్ని తీసుకుని పక్క గదిలోకి వచ్చి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడిపారు.

శనివారం ఉదయం పక్కింట్లోని మహిళ వాకిలి ఊడుస్తుండటంతో అలికిడి చప్పుడు విని ఆమెను పిలిచి విషయం చెప్పారు. వెంటనే స్థానికులు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, భార్యాభర్తలిద్దరూ గొడవ పడిన దాఖలాలు కూడా లేవని, హత్యకు, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఏసీపీ చెప్పారు.

చదవండి: విశాఖలో షాకింగ్‌ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)