Breaking News

HYD: లలితా జ్యువెలరీ చోరీ కేసులో వీడిన మిస్టరీ

Published on Thu, 01/04/2024 - 19:38

హైదరాబాద్‌, సాక్షి: ప్రముఖ జ్యువెలరీ స్టోర్‌ లలితాలో జరిగిన చోరీ మిస్టరీ వీడింది. సేల్స్‌మెన్‌ దృష్టి మళ్లించి ఓ మహిళ నగలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ మిస్టరీని పోలీసులు చేధించారు. ఆ కిలాడీ లేడీని ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. 

నగరంలోని చందానగర్‌ లలితా జ్యువెలరీ స్టోర్‌ బ్రాంచ్‌లో డిసెంబర్‌ 31వ తేదీన నగలు కనిపించకుండా పోయాయి. దీంతో చోరీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. స్టోర్‌లో పలువురిని విచారించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా.. తొలుత లాభం లేకపోయింది. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. అయితే పదే పదే ఫుటేజీలను గమనించిన క్రమంలో.. మెరుపు వేగంతో నగలు మాయం చేసిన ఓ మహిళ కనిపించింది.  

ఖతర్నాక్‌ కిలాడీ
ఈ కేసులో చోరీకి పాల్పడిన మహిళను సరూర్‌ నగర్‌కు చెందిన గౌతమిగా గుర్తించారు. విశేషం ఏంటంటే.. గౌతమి నగరంలో 13 చోరీ కేసుల్లో నిందితురాలు. రద్దీగా ఉండే జ్యువెల్లరీ షాపులే లక్ష్యంగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తూ వస్తోంది. క్షణాల్లో దొం‍గతనాలు చేసి మాయమైపోవడంలో దిట్ట అయిన గౌతమిని మొత్తానికి పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)