పోలీసుల కర్కశం.. యాక్సిడెంట్‌ జరిగిన ప్రాంతం మాది కాదయ్యా..

Published on Mon, 01/06/2025 - 11:38

భోపాల్‌ : మానవత్వం చూపించాల్సిన పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే.. బాధితుడి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి కర్కశాన్ని ప్రదర్శించారు. అచ్చం ‘జై భీమ్‌’(jai bhim) సినిమాలో పోలీస్‌ స్టేషన్‌లో తాము చేసిన దాడిలో గిరిజనుల చనిపోతే.. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు బాధితుల మృతదేహాల్ని జిల్లాల సరిహద్దుల్ని ఎలా మార్చారో.. అలాగే ఈ విషాదంలో బాధితుడికి ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ రెండు రాష్ట్రాల పోలీసులు తప్పించుకున్నారు. డెడ్‌ బాడీని రోడ్డుమీద వదిలేశారు. చివరికి..  

మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ అహిర్వార్ (27) దినసరి కూలి. మధ్యప్రదేశ్‌ (madhya pradesh) నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడే దొరికిన పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో రాహుల్‌ మధ్యప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు.  

రాహుల్‌ మరణంపై సమాచారం అందుకున్న రాహుల్‌ సన్నిహితులు మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సన్నిహితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉత్తరప్రదేశ్‌(uttarpradesh)లోని మహోబా జిల్లాలోని మహోబ్‌కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

చేసేది లేక  రాహుల్‌ భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి ఉత్తర ప్రదేశ్‌ మహోబ్‌కాంత్ పీఎస్‌కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. శవ పరీక్ష చేయించేందుకు నిరాకరించారు. ఇది తమ ప్రాంతం పరిధిలోకి రాదంటూ బుకాయించారు.

దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఆ తర్వాతే గ్రామస్తులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

రాహుల్‌ మరణంతో అతడి కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహం పక్కనే రోదిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా యువకుడి బంధువు మాట్లాడుతూ...‘ మా కుటుంబ సభ్యుడు రాహుల్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మృత దేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉంది. మేం చేసిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ ప్రదేశం మా ప్రాంతంలోకి రాదని మమ్మల్ని తిట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించాలని కోరారు.

పోలీసుల తీరుతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే..రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని రోడ్డుపై నుంచి బయటకు తీశారు’అని కన్నీరు మున్నీరయ్యారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)