Breaking News

Hyderabad: మరణంలోనూ వీడని స్నేహ బంధం

Published on Mon, 08/05/2024 - 06:55

రాయదుర్గం: స్నేహితుల దినోత్సవం రోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన నాగేశ్వరరావు కుమారుడు వి.బాల ప్రసన్న (24) ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చాడు. 

ఇదే జిల్లా మర్రిచెట్టుపాలేనికి చెందిన తన స్నేహితుడు కె.రోహిత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో కలిసి బాలప్రసన్న మియాపూర్‌లోని హఫీజ్‌పేట్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం వేకువజామున బైక్‌పై వెళ్తున్నారు. రోహిత్‌ వాహనం నడిపిస్తుండగా ప్రసన్న వెనక సీటులో కూర్చున్నాడు. మసీదుబండ నుంచి హఫీజ్‌పేట్‌ మార్గంమధ్యలో కొత్తగూడ జంక్షన్‌ ఫ్లైఓవర్‌ మూల మలుపు వద్ద వీరి బైక్‌ అదుపు తప్పి ఫ్లై ఓవర్‌ గోడను ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు.

 ఇద్దరి తలలకు, ఇతర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ప్రసన్నను కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రికి, రోహిత్‌ను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో రోహిత్‌ మృతిచెందాడు. బాల ప్రసన్న 5.18 గంటలకు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 48 నిమిషాల వ్యవధిలో ఇద్దరు స్నేహితులూ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు.

 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)