Breaking News

ప్రాణం తీసిన 'నో బాల్‌' గొడవ.. అంపైర్ అందుకు నో చెప్పడంతో..

Published on Mon, 04/03/2023 - 21:42

భువనేశ్వర్‌: క్రికెట్ మ్యాచ్ ఆడే సమయంలో ఇరు జట్లు అపుడుపుడు మాటల యుద్ధానికి దిగుతాయి. భౌతిక దాడులు చేసుకునే సందర్భాలు అత్యంత అరుదు. అయితే గల్లీ క్రికెట్‌లో మాత్రం ఇలా కాదు.. మాటా మాటా పెరిగి ఒక్కోసారి ఇరుజట్లు బాహాబాహీకి దిగుతాయి. ఆటగాళ్లు ఒకరిపైఒకరు దాడి చేసుకుని తీవ్రంగా గాయపరుచుకుంటారు.

ఒడిశా కటక్ జిల్లా మహిసానంద  గ్రామంలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. క్రెకెట్ మ్యాచ్‌ ఆడే సమయంలో అంపైర్‌ నో బాల్ ఇవ్వలేదని సంగ్రామ్ రౌత్ అనే ఆటగాడు రెచ్చిపోయాడు. నో బాల్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. కానీ అంపైర్‌ అందుకు ఒప్పకోలేదు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన సంగ్రామ్‌, మరో ఇద్దరు ఆటగాళ్లు.. అంపైర్‌ను తోసేసి దాడి చేయబోయారు.

గొడవ పెద్దది కావడంతో లక్కీ రౌత్ అనే స్థానికుడు అంపైర్‌ను కాపాడేందుకు మధ్యలో జోక్యం చేసుకుని వెళ్లాడు. దీంతో సంగ్రామ్ అతడ్ని బ్యాట్‌తో కొట్టాడు. ఛాతీలో కత్తితో పొడిచాడు. దీంతో లక్కీ తీవ్రగాయాలతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నట్లు వెల్లడించారు.
చదవండి: 'గాడిద పాల సబ్బు వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు'

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు