Mumbai Hotel Fire: ఒక్కటవ్వకుండానే ఒక్కటిగానే వెళ్లిపోయారు..

Published on Mon, 08/28/2023 - 19:47

ముంబై: ఆదివారం రోజున నైరోబీ వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఓ జంట శాంతాక్రూజ్ సమీపంలో గెలాక్సీ హోటల్‌లో బస చేశారు. అంతలో అక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ఆ జంట సజీవ దహనమయ్యారు. వీరితోపాటు ఆ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా చనిపోయారు.   

ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని గెలాక్సీ హోటల్‌లోహోటల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒక జంట కథ అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. 

మృతుడి సొంతూరైన రామ్‌పార్ గ్రామ సర్పంచ్ సురేష్ కారా తెలిపిన వివరాల ప్రకారం ఎన్నారై కిషన్ హాలాయ్(28) అతడికి కాబోయే భార్య రూపాలు వెకారియా(25) ఇద్దరి కుటుంబాలు గుజరాత్‌లోని రామ్‌పార్ గ్రామానికి చెందినవారే అయినా వారి పూర్వీకులు నైరోబీలో స్థిరపడటంతో వీరు కూడా అక్కడే పెరిగి పెద్దయ్యారన్నారు.  

వీరిరువురికీ పెద్దలు పెళ్లి కూడా నిశ్చయించారు.. అయితే కిషన్ సోదరుడి వివాహం నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారని వివాహం పూర్తవగానే కొత్తగా పెళ్ళైన జంటతో పాటు ఈ జంట తల్లిదండ్రులు నైరోబీ వెళ్లిపోగా కిషన్ మాత్రం బంధువులను కలిసి వెళదామని ఆగిపోవడంతో అతడితోపాటు రూపాల్ కూడా ఉండిపోయినాట్లు తెలిపారు. 

అన్ని పనులను పూర్తిచేసుకుని ఆదివారం వీరు కూడా నైరోబీ తిరిగి వెళ్లాల్సి ఉండగా అహ్మదాబాద్ నుండి ముంబై చేరుకున్నారు. తీరా ముంబై వచ్చాక విమానం ఆలస్యమవుతుందని తెలియడంతో శాంతాక్రూజ్ సమీపంలోని గెలాక్సీ హోటల్‌లో బస చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జంట ఒక్కటవ్వకుండానే ఒక్కటిగా వెళ్లిపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు సురేష్ కారా. 

ఇది కూడా చదవండి: సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే?

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)