పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే..

Published on Wed, 02/22/2023 - 13:13

రాయ్‌పూర్‌: ఈ జంటకు ఆదివారమే పెళ్లైంది. విహవా వేడుక ఘనంగా జరిగింది. మంగళవారం రాత్రి గ్రాండ్‌గా రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏం జరగిందో తెలియదు. రిసెప్షన్‌కు కొన్ని గంటల ముందే  నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో శవాలుగా కన్పించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని బ్రిజన్‌గర్‌లో ఈ ఘటన జరిగింది.

అయితే ఇద్దరి ఒంటిపై కత్తిగాయాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. భార్యభర్తలిద్దరి మధ్య  గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. భర్త తన భార్యను పొడిచి చంపిన తర్వాత, తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పేర్కొన్నారు.

ఈ దంపతులు గదిలోకి వెళ్లి తాళం వేసుకొని గొడవపడ్డారని, అరుపులు కేకలు వినిపించాయని కుటంబసభ్యులు చెప్పారు. లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోడవంతో కిటీకీలోనుంచి చూస్తే ఇద్దరు రక్తపుమడుగులో కన్పించారని పేర్కొన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భర్తే భార్యను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఇతర కోణాల్లోనూ విచారణ జరుపుతామన్నారు.
చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరకు..

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)