Breaking News

రోడ్డు ప్రమాదం.. పెళ్లైన మూడో రోజే నవవధూవరులు మృతి

Published on Tue, 02/14/2023 - 10:53

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధూవరులిద్దరూ మృత్యువాతపడ్డారు. ఒడిశా సరిహద్దులోని గొల్రంత వద్ద దంపతులు  ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పెళ్లైన రెండు రోజులకే దంపతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాలు.. ఇచ్ఛాపురం బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు నాగరత్నం, రామారావు కుమారుడు వేణుకు (26) ఒడిశాలోని బరంపురానికి చెందిన స్‌ ప్రవల్లికతో (23) ఈనెల 10న సింహాచలం వరహా లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో వివాహమైంది. పెళ్లికి బంధువులందరూ హాజరయ్యారు. ఈనెల 12న ఆదివారం ఇచ్ఛాపురంలో  రిసెప్షన్‌ జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం సోమవారం సాయంత్రం నూతన జంట ద్విచక్రవాహనంపై ప్రవల్లిక ఇంటికి బరంపురానికి బయల్దేరారు. కాసేపు ఉండి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో గొళంత్రా దగ్గర వెనక నుంచి వస్తున్న ఓ ట్రాక్టర్‌ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అక్కడికక్కడే మృతిచెందింది.

వరుడికి తీవ్ర గాయాలవ్వగాని స్థానికులు బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా మృతిచెందారు. కలకాలం కలసి కాపురం చేయాలనుకున్న జంట పెళ్ళి అయిన ఇలా కాళ్ల పారాణి ఆరకముందే మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చదవండి: Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)