Breaking News

వెబ్‌ సిరీస్‌ స్ఫూర్తి.. ఈ జంటది మామూలు తెలివి కాదు!

Published on Mon, 06/14/2021 - 16:14

ముంబై : కేకుల్లో  ఇడిబుల్‌(తినడానికి వీలుగా ఉండే) గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్న ఓ యువ జంటను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్ట్‌ చేశారు. శనివారం ముంబై, మలద్‌లోని ఓ బేకరీపై రైడ్‌ చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి గంజాయి సప్లయ్‌ చేస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేశారు. ఈ జంట లాక్‌డౌన్‌ సమయంలో బేకరీ వ్యాపారం ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా కేకుల అమ్మకాలు సాగిస్తోంది. ఈ జంట వెబ్‌ సిరీస్‌ స్ఫూర్తితో గంజాయి కేకులు తయారు చేయటం మొదలుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుని గంజాయి కేకులు అమ్మేవారు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా డబ్బులు వసూలు చేసేది.

అధికారులు ఈ జంట వద్దనుంచి 830 గ్రాముల ఇడిబుల్‌ గంజాయిని, 160 గ్రాముల మామూలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఇడిబుల్‌ గంజాయి సప్లయ్‌ చేస్తున్నవారి కోసం అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు. నిందితుల ఇంటినుంచి కస్టమర్ల పేర్లు ఉన్న ఓ డైరీని సైతం స్వాధీనపర్చుకున్నారు. గంజాయి కేకులు కొద్దిగా ఆకుపచ్చరంగులో ఉండి.. కొద్దిగా గంజాయి వాసన కూడా వస్తుందని.. మామూలు కేకులకు, గంజాయి కేకులకు తేడా కనుక్కోవటం అంత వీజీ కాదని అధికారులు చెబుతున్నారు.

చదవండి : హైదరాబాద్‌లో: కార్లను అద్దెకు తీసుకుని ఆపై అమ్మకం..

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)