Breaking News

కట్నం వేధింపులతో  యువతి ఆత్మహత్య... ఒంటిపై సూసైడ్‌ నోట్‌ 

Published on Fri, 07/18/2025 - 15:33

లక్నో: మరింత కట్నం తేవాలంటూ అత్తింటి వారు పెట్టే వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమంటూ భర్తతోపాటు అత్తింట్లో వాళ్ల పేర్లను ఒంటిపై రాసుకుని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మనీషా అనే యువతికి 2023లో నోయిడాకు చెందిన కుందన్‌తో పెళ్లయింది. మొదట్లో అంతా సాఫీగానే వారి కాపురం సాగింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. 

పెళ్లప్పుడు బుల్లెట్‌ బైక్‌ను కొనిచ్చారు మనీషా తల్లిదండ్రులు. అయితే, ఎస్‌యూవీ కావాలంటూ కుందన్‌ కుటుంబీకులు డిమాండ్‌ చేయనారంభించారు. తమకు అంత స్థోమత లేదని చెప్పడంతో మనీషా తల్లిదండ్రులు తెలపడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులు తీవ్రతరం చేశారు. ‘అన్నం పెట్టకుండా పస్తులుంచుతున్నారు. గదిలో ఉంచి తాళం వేస్తున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కుందన్‌ బెదిరిస్తున్నాడు’అని మనీషా తన చేతిపై రాసుకుంది. 

వేధింపులు తట్టుకోలేక మనీషా 2024లో పుట్టింటికి చేరుకుంది. అక్కడున్నా వేధింపులకు మాత్రం అంతం లేకుండాపోయింది. ఇటీవల కుందన్, అతడి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు గ్రామ పెద్దను తీసుకువచ్చి విడాకుల పత్రాలపై సంతకం చేయాలంటూ మనీషాను, ఆమె కుటుంబాన్ని ఒత్తిడి చేశారు. ఒప్పుకోకపోయేసరికి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘నా మరణానికి భర్త కుందన్, మరుదులు దీపక్, విశాల్‌లే కారణం. పంచాయితీ సమయంలో వారు నా కుటుంబానికి హెచ్చరికలు చేశారు’అంటూ మనీషా తన కాలిపై రాసుకుంది.

 ‘మంగళవారం రాత్రి మేడపైన పడుకునేందుకు వెళ్లిన మనీషా పురుగుమందు తాగింది. ఉదయానికి విగతజీవిగా కనిపించింది’అని కుటుంబీకులు చెప్పారు. అత్తింటి నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, వేధింపులను తాళలేక డిప్రెషన్‌తో బలవన్మరణం చెందిందన్నారు. చనిపోయేముందే శరీరంపై ఆమె ఈ మేరకు రాసుకుందన్నారు. మనీషా మరణానికి విష ద్రావకమే కారణమని పోస్టుమార్టంలో తేలిందని ఏఎస్‌పీ ఎన్‌పీ సింగ్‌ చెప్పారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)